తరం మారుతోంది.. తరంతో పాటు ఆలోచనలూ మారిపోతున్నాయి. ఇప్పుడంతా వేగం ప్రధానమవుతోంది. కొత్త తరాన్ని పాత తరం అందుకోలేకపోతోంది.ఇది అన్ని రంగాల్లోనూ ఉన్నదే. అయితే ఇది అత్యంత సహజం కూడా. రాజకీయాల్లోనూ అంతే కదా.. 40ఏళ్ల అనుభవజ్ఞుడిని అని చెప్పుకునే చంద్రబాబు.. యువ నేత జగన్ చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యారు.

 

 

అయితే ఈ యువతరానికి ఉన్న వేగంతో పాటు కాస్త అనుభవమూ కావాలి. ఈ విషయం ఏడాది పాలన తర్వాత జగన్ కూ అర్థమవుతోంది. ఏడాది పాలనలో ఆయన మరింతగా రాటు దేలుతున్నారు. అయితే తాజాగా ఓ అపురూప దృశ్యం ఆకట్టుకుంటోంది. ఏపీకి కేటాయించిన యువ ఐఏఎస్ అధికారులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

 

 

2018 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. వారికి కేటాయించిన శాఖలపై యువ ఐఏఎస్‌లు సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చారు. యువ అధికారులు, యువ సీఎం.. ఆ భేటీ ఆహ్లాదంగా సాగింది. కేటాయించిన శాఖల్లో అవగాహన, అనుభవం పెంచుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువ ఐఏఎస్‌లకు సూచించారు.

 

 

ప్రజంటేషన్‌ ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లను సీఎం అభినందించారు. కేటాయించిన శాఖల్లో అవగాహన, అనుభవం పెంచుకోవాలని, వ్యవస్థల్లో లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆదేశించారు. అనుభవజ్ఞులైన అధికారుల నుంచి వారి మార్గనిర్దేశం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారు దిగిన ఓ ఫోటో చూడముచ్చటగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: