ఓవైపు సరిహద్దుల్లో చైనా భారత్ తో చర్చలు జరుపుతూనే ఉంది. మరోవైపు తన పని తాను సైలంట్ గా కానిచ్చేస్తోంది. దేని దారి దానిదే అన్నట్టు చైనా తన వక్రబుద్దిని చాటుతోంది.

ఇటీవల లద్దాఖ్ లో భారత సైన్యంతో ఘర్షణ తర్వాత కూడా చైనా గల్వాన్‌ లోయలో తన అరాచకాలు ఆపడం లేదు. చైనా సైన్యం భారత్‌లోకి 423మీటర్లు చొచ్చుకుని వచ్చిందట.

 

 

ఈ విషయాన్ని ఉపగ్రహాల చిత్రాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. 1960లో చైనాయే పేర్కొన్న సరిహద్దు రేఖను దాటి 423మీటర్ల మేర ఆ దేశం దురాక్రమణకు పాల్పడినట్టు ఈ చిత్రాల ద్వారా వెల్లడవుతోంది. అయితే ఈ విషయంపై భారత్ చాలా సీరియస్ గా ఉన్నట్టు సైనిక వర్గాలు చెబుతున్నాయి.

 

 

ఆ దేశంతో నేడు కమాండర్‌ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఆ చర్చల్లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ జరిగిన రెండు దఫాల చర్చలు సరిహద్దుకు చైనా వైపున ఉన్న మోల్డోలో జరిగాయి. ఈరోజు జరిగే చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరుగుతాయి.

 

 

చైనాతో వ్యవహారం అంటే కత్తిమీద సాము లాంటిదే అంటున్నారు విదేశాంగ నిపుణులు. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే వ్యక్తితత్వం ఉన్న చైనాతో అన్ని వైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చైనా డ్రాగన్ భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: