ఏపీ సీఎం జగన్ అంటేనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతారన్న సంగతి తెలిసిందే. ఆయన తన తాజా కొత్త పలుకులోనూ అదే వాణి వినిపించారు. జగన్ రాజకీయ వేధింపులు మానుకోవాలన్నారు. అంతే కాదు.. ఇలాగే చేస్తే మళ్లీ చంద్రబాబుదే అధికారం అంటూ హెచ్చరించేశారు.

 

ఏబీఎన్‌ ఆర్కే రాత ఏంటో.. దానికి కామెంట్‌ ఏంటో చూద్దాం..

 

ఆర్కే రాత :

జగన్‌ అవినీతికి పాల్పడలేదనీ, పులుకడిగిన ముత్యమనీ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టలేదు. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు అవడం, దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కోసం కలవరిస్తూ ప్రజల్లోనే ఉండిపోవడంతో జాలిపడి అధికారం కట్టబెట్టారు.

 

కామెంట్:

ఇది మరీ విడ్డూరంగా ఉంది కదా ఆర్కే గారూ.. ఎవరైనా జాలిపడి అధికారం కట్టబెడతారా.. అందులోనూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆణిముత్యాన్ని కాదనుకుని.. అంటే జగన్ అధికారంలోకి రావడంలో చంద్రబాబు తప్పులేమీ లేవన్నమాట. జస్ట్ జనం జాలిపడి ఓట్లేశారన్నమాట. అదే నిజమైతే.. 2019లోనే జగన్ గెలవాలిగా..

 

 

ఆర్కే రాత :

జగన్‌ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ప్రైవేటు సంభాషణలలో ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలిసిందే! అయితే ఇప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆ పదవికి ఉన్న ఔన్నత్యం వల్ల ఆయనను అందరూ గౌరవిస్తున్నారు. ఇది గమనించని జగన్‌ తనను తాను మహాశక్తివంతుడిగా ఊహించుకుని రాజ్యాంగానికి కూడా తాను అతీతుడను అన్నట్టు దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తున్నారు.

 

 

కామెంట్ :

అవునా.. ప్రైవేటు సంభాషణలలో జగన్ పై కామెంట్లు చేస్తారా..అది అందరికీ తెలుసా.. మరి ఇది చంద్రబాబుకు వర్తించదా గురువు గారూ.. చంద్రబాబు గురించి అంతా ప్రైవేటు సంభాషణల్లోనూ అంతా అపర చాణక్యుడు అనే అంటారా.. ఇంతకీ ప్రైవేటు సంభాషణల్లో మీ గురించి ఏమనుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా..?

 

ఆర్కే రాత :

కొంతమందికి డబ్బు పంచినంత మాత్రాన దేవుళ్లు అయిపోరు. సంక్షేమ పథకాల ఫలాలు అనుభవిస్తున్నవాళ్లు కష్టపడి సంపాదించి పన్నులు చెల్లిస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పాలి గానీ, రాజకీయ నాయకులకు కాదు. జగన్‌ గానీ, చంద్రబాబు గానీ, కేసీఆర్‌ గానీ.. మరొకరు గానీ తమ జేబులో నుంచి తీసి పంచిపెట్టడంలేదు.

 

కామెంట్ :

అరే.. ఈ విషయంలో మీకు ఎప్పుడు జ్ఞానోదయం అయ్యింది గురువు గారూ.. మరి గతంలో చంద్రబాబు కూడా ఇలాగే పథకాల పేరుతో డబ్బులు పంచారు కదా.. అప్పుడు తమకు ఇలా అనిపించలేదేంటో.. జగన్ డబ్బుపంచితే.. అది జనం సొమ్మా.. చంద్రబాబు పంచితే మహానుభావుడా.. బావుంది.. బావుంది.

 

 

ఆర్కే రాత :

మందబలం ఉందన్న కారణంగా గిట్టనివారిని అదేపనిగా వేధిస్తూ పోతే నష్టపోయేది ఎవరు? ఒకప్పుడు జగన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి జైలులో పెట్టడం వల్లనే కదా ఆయన పట్ల ప్రజలు సానుభూతి చూపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, చివరకు యనమల, చినరాజప్ప వంటివారిని ఇలాగే వేధిస్తే సానుభూతి పవనాలు వారివైపు మళ్లకుండా ఉంటాయా?

 

కామెంట్:

ఓహో.. అంటే జగన్ కేవలం సానుభూతి వల్లనే అధికారంలోకి వచ్చాడంటారు.. మంచిదే.. తెలుగుదేశం నాయకులను వేధిస్తే సానుభూతి తెలుగుదేశం వైపు మళ్లుతుందంటారు.. మంచిదేగా.. అయితే ఇంకాస్త పెద్ద నాయకులను వేధించడమని జగన్ కు చెప్పకూడదూ... ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం తప్పకుండా తెలుగుదేశానిదే అవుతుంది.. ఏమంటారు గురూజీ..

మరింత సమాచారం తెలుసుకోండి: