చైనాతో నెలకొన్ని ఘర్షణ వాతావరణంలో భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశానికి చెందిన పలు యాప్‌లపై నిషేధం విధించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని టిక్‌టాక్‌, షేర్ ఇట్ వంటి 59 యాప్‌లపై నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయం సోషల్ మీడియాను బాగా వాడేవారికి, స్మార్ట్ ఫోనే జీవితంగా బతికేవారికి నిరాశ కలిగించింది.

 

 

ఇన్నాళ్లు తమను అలరించిన చైనా యాప్‌లకు ఆల్టర్నేటివ్స్ ఏంటా అని వెదుకుతున్నారు. ఈ చైనా యాప్‌లలో బాగా ఆకట్టుకున్నది టిక్ టాక్..చిన్నపెద్ద తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంది. అదొక్కటే కాదు.. విగో వీడియో, లైక్‌, హలో యాప్‌ లు కూడా బాగా పాపులర్‌ అయ్యాయి. అయితే వీటిలాగానే ఉండే ఇండియన్‌ యాప్స్ ఉన్నాయి. అవేంటంటే.. రొపొసొ, డబ్‌ స్మాష్‌, పెరిస్కోప్‌లాంటివి.

 

 

ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో జూమ్ యాప్ బాగా ఫేమస్ అయ్యింది. ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా ఈ యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఇది కూడా చైనా యాపే. దీనికి బదులు గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌ వంటివి ఉన్నాయి. సే నమస్తే యాప్‌ను బాగానే ఉంటుంది.

 

 

ఇంకా ఫోన్ లాక్‌ వేయాలంటే స్మార్ట్‌ యాప్‌ లాకర్, లాక్‌ యాప్‌ - ఫింగర్‌ప్రింట్‌, కీప్‌ సేఫ్‌, నొర్టన్‌ యాప్‌ లాక్‌, లాక్‌ మై పిక్స్‌ సీక్రెట్‌ ఫొటో వంటి యాప్స్ ఉన్నాయి. బ్రౌజింగ్ కోసం గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ లాంటి బ్రౌజర్లు ఉన్నాయి. స్కాన్‌ చేయాలంటే అడొబ్‌ స్కాన్‌, మైక్రోసాఫ్ట్‌ లెన్స్‌, ఫొటో స్కాన్‌ బై గూగుల్‌ లాంటి యాప్స్‌ ఉన్నాయి. కాస్త ఓపికగా వెదకాలికానీ చైనా యాప్‌ కు దీటుగా బోలెడ్ యాప్స్ ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: