ప్రస్తుత పరిస్దితుల్లో మనుషులకు కరోనా కామన్‌గా మారిపోయింది.. కానీ దీని బారినపడుతున్న వారి సంఖ్యనే సచిన్ టెండుల్కర్ సెంచరీలు చేసినంత వేగంగా పరిగెడుతుంది.. ఒకరకంగా చెప్పాలంటే ఇంతితై వటుడింతై అనే పద్యం ఈ కరోనాకు అన్వయిస్తే అక్షరాల సరిపోతుంది.. ఇన్నాళ్లు ఎదుర్కొన్న రోగాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రపంచాన్నే పరిగెత్తిస్తున్న కరోనా ఒక ఎత్తులా ఉంది.. ప్రస్తుత పరిస్దితుల్లో ఇది ఎలా వ్యాపిస్తుంది, దీని పూర్తి లక్షణాలు ఏంటి అనేది సోషల్ మీడియా పుణ్యమా అని గాలి వ్యాపించినట్లుగా ప్రతి చోట పాకింది.. ప్రతి వారికి అర్ధం అయ్యేలా తెలిసింది..

 

 

ఇక ఒక్క అణుబాంబు ఎంత విస్పోటనాన్ని కలిగిస్తుందో, కరోనా వచ్చిన వ్యక్తి అంతగా ఈ వైరస్‌ను వ్యాపిస్తున్నాడు.. దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన.. ఇకపోతే ఈ కరోనా కాలంలో ఎక్కడికి వెళ్లాలన్న భయం భయంగానే ఉంటుంది.. నలుగురు పోగైయ్యే ప్రదేశం ఏదైనా ఇప్పుడు ప్రమాదకరమే.. ఒకప్పుడు పాకిస్దాన్ వాడు మానవ బాంబులు పేల్చుతున్నాడని ఎక్కడ కూడా మనుషులు గుంపులు గుంపులుగా ఉండకండని అధికారులు హెచ్చరించారు.. కానీ ఇప్పుడు పాక్ వాడికంటే చైనా వాడి ద్వారా చాలా పవర్‌పుల్ విధ్వంసం జరుగుతుంది కరోనా ద్వారా.. ఇలాంటి పరిస్దితుల్లో ఒక వ్యక్తి అత్మహత్య చేసుకుని మరణిస్తే అతని అంత్య క్రియలకు హాజరైన వారందరు క్వారంటైన్‌లోకి వెళ్లవలసి వచ్చింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మల రామారారంలో చోటు చేసుకుంది.

 

 

ఇకపోతే ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి అంత్యక్రియల్లో ఊరు ఊరంతా పాల్గొన్నారు. కాగా మృతుడికి కరోనా ఉందన్న విషయం తెలియని గ్రామస్తులు సుమారుగా 500 మంది వరకు అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. ఇక అతనికి కరోనా అని తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్థుల్లో  కలకలం చెలరేగింది. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ క్రమంలో దాదాపుగా గ్రామం మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్ల వలసి వచ్చింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: