విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అందాల నగరం, ప్రశాంత నగరం ఇలా ఎన్నో విశేషణాలు విశాఖకు ఉన్నాయి. అయితే ఇపుడు విశాఖలో ప్రశాంతత మాత్రం కరువు అవుతోంది. అభివ్రుధ్ధి మాటున చుట్టూ చేరిన పరిశ్రమలూ వాటితో పాటు వచ్చేసిన విషవాయువులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.

 

నిన్న గోపాలపట్నం దగ్గర ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గాస్ లీకేజితో ఏకంగా పదిహేను మంది చనిపోయారు. ఇపుడు మరో ప్రమాదం. ఈసారి కూడా విష వాయువే ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. మరింతమందిని తీవ్ర‌ అస్వస్థత పాలు చేసింది.విశాఖ సమీపంలోని పరవాడ వద్ద ఫార్మాసిటీ ఉంది. అక్కడ విషవాయులు వెదజల్లే కర్మాగారాలు చాలానే ఉన్నాయి. అందులో మెయింటెయిన్ పెద్దగా ఉండదని ఆరోపణలు ఉన్నాయి. ఓ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమే ఆడుతున్నారని అంటున్నారు.

 

అతి సున్నితమైఅన్ ఈ ప్రదేశంలో జనవాసాలు కూడా దూరంగా ఉండాలి. కానీ సమీపంలోనే ఉంటాయి. మరో వైపు ఈ కర్మాగారంలో పనిచేసేవారికి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించరని కూడా చెబుతారు. ఈ నేపధ్యంలో తరచూ గ్యాస్ లీకేజి వంటివి జరుగుతున్నాయి. విశాఖ అభివ్రుధ్ధి చెందుతుందని అంతా భావిస్తారు. కానీ వాటి మాటున ప్రమాదాలు కూడా ఇలా పొంచి ఉండి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. తాజా ఘటనలో ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

 

సమాచారం కూడా వెంటనే ఇవ్వకుండా మూడు నాలుగు గంటలు తాత్సారం చేసి ఇవ్వడం చూస్తూంటే ప్రజల ప్రణాలు, కర్మాగారంలో భద్రత, కార్మికుల జీవితాల పట్ల యాజమాన్యాలు ఎంత బాధ్యాతారహితంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమవుతోంది. కాగా ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తే  అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఇక విష వాయువులు ఉన్న కర్మాగారాల విషయంలో పాలకులు మూడవ కన్ను పెట్టాల్సి ఉందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: