చైనా దూకుడుకు జవాబు చెప్పేందుకు మోడీ సిధ్ధంగా ఉన్నారు. ఆయన అన్ని రకాలుగానూ రెడీ అవుతున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. చైనా ఈ దెబ్బకు భవిష్యత్తులో కనీసం భారత్ గురించి కనీస‌ ఆలోచన కూడా చేయకూడదన్నది మోడీ మార్క్ మాస్టర్ ప్లాన్.

 

అందుకే అర్జంటుగా రఫెల్ యుధ్ధ విమానాలను దేశానికి రప్పిస్తున్నారు. ఈ విమానాలు ఈ నెలాఖరుకు వస్తాయి, మొదట నాలుగు రావాల్సి ఉండగా, ఇపుడు అవసరాల ద్రుష్ట్యా ఎనిమిది వరకూ రఫెల్ ఫైటర్ జెట్స్ భారత్ చేరనున్నాయి. అతి కీలకమైన స్థావరాలను లక్ష్యాలను కూడా ఈ విమానాలు ఢీ కొడతాయి. టార్గెట్ ని పక్కాగా రీచ్ అవుతాయి. ఇప్పటివరకూ అత్యంత ఆధునాతనమైన యుధ్ధ విమానాలు ఇవే కావడం విశేషం.

 

వీటిని భారత్ పాక్ మీద, చైనా మీద ప్రయోగించేందుకు సమకూర్చుకుంటోంది. 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న వాటిని చాలా సులువుగా ఛేదిస్తుంది. అందుకే భారత్ తన శక్తికి మించి పెట్టుబడి పెట్టి రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంది. ఇక చైనాతో యుధ్ధానికి రెడీ అంటోంది. నిజానికి చైనాకు యుధ్ధం చేయాలని ఉందా అన్న ప్రశ్న వస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చీ కొట్టించుకుంది. దాంతో పాటు ఇపుడు యుధ్ధం అంటే నిండా మునిగేది చైనావే అంటున్నారు. కరోనా వైరస్ చైనాలో పుట్టిందని ప్రపంచ దేశాలు వెలి వేస్తున్నాయి.

 

మరో విషయంగా చూస్తే చైనా ఆర్ధికంగా బలోపేతం కావాలని భావిస్తోంది. దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. ఇపుడు కనుక యుధ్ధం అంటే ఎక్కువగా నష్టపోయేది చైనా అని నివేదికలు ఉన్నాయి. చైనా కలలను సమాధి చేసే అవకాశాన్ని భారత్ తీసుకుంటుంది. దాంతో డ్రాగన్ భయపెట్టి బెదిరించి దందా చేయాలని మాత్రమే అనుకుంటోంది. నిజంగా యుధ్హానికి వస్తే మాత్రం భారత్ తడాఖా చూపిస్తుందని కూడా తెలుసు. 

 

ఇదే చైనా అంతరంగం, దాన్ని చక్కంగా అర్ధం చేసుకున్న మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. చైనా మీదకు యుధ్ధానికి రెడీ అని సంకేతాలు పంపడం అందులో భాగమే. ఈ దెబ్బకు డ్రాగన్ దిగిరావడం ఖాయమని అంటున్నారు. సమరమా, శరణమా అని మోడీ గర్జిస్తూంటే డ్రాగన్ తోక ముడిచి చేతులు చాపడం ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: