దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించటం లేదనే సంగతి తెలిసిందే. అయితే లక్షణాలు కనిపించని వారి గురించి చైనా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరికైనా కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోతే సంతోషంగానే ఉంటుంది. 
 
కానీ వారిలో వారిలో యాంటీ బాడీలు త్వరగా క్షీణిస్తున్నాయని చైనా అధ్యయనంలో తేలింది. వారిలో కరోనా సోకిన రెండు నెలల తరువాత యాంటీబాడీల సంఖ్య గుర్తించలేని స్థాయికి పడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించని 40 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య తగ్గిందని... మిగిలిన వారిలో సాధారణ స్థాయిలో ఉందని.... లక్షణాలు కనిపించకపోతే మరీ ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
లక్షణాలు కనిపించిన వారిలో కేవలం 13 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీల స్థాయి పడిపోయిందని పరిశోధనల్లో తేలింది. లక్షణాలు కనిపించని వారిలో వైరస్ కు రోగనిరోధక ప్రతిస్పందన బలహీనంగా ఉందని తెలుస్తోంది. కరోనా భారీన పడిన వారికి మరలా వైరస్ సోకే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. 
 
మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవటం, కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారిని బయటకు రాకుండా చూడటం చేయాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందో చెప్పలేం కాబట్టి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తలు తీసుకోవాలి.            
               

మరింత సమాచారం తెలుసుకోండి: