దివంగత హీరోయిన్, అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన ఇద్దరు కుమార్తెలైన జాన్వీ కపూర్, ఖుషి లతో కలిసి ముంబాయి నగరంలో నివసిస్తున్నారు. అయితే వారి నివాసంలో పని చేసే ముగ్గురు పని మనుషులకు కరోనా వైరస్ సోకిందని వైద్య పరీక్షలలో తేలింది. తమ ఇంట్లోనే పనిచేసే ఒక వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడంతో బోనికపూర్ అతడిని ఇతర అసిస్టెంట్ల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ లో అతనికి కొవిడ్-19 టెస్ట్ నిర్వహించగా... పరీక్షలలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు బోనీ కపూర్ కి సమాచారం అందజేశారు.


తదనంతరం ఇంట్లో పనిచేసే వారికి,  నివసించేవారికి కూడా డాక్టర్లు కరోనా టెస్టులు నిర్వహించారు. ఐతే ఇంకో ఇద్దరి పని మనుషులకు కూడా కరోనా సోకిందని తేలింది. కానీ బోనీ కపూర్ కి, తన ఇద్దరు కుమార్ కి ఎన్ని సార్లు టెస్టులు నిర్వహించినా నెగిటివ్ అనే నిర్ధారణ అయింది. కానీ ఆ ముగ్గురిని హోమ్ క్వారంటైన్ లో ఉండవలసిందిగా డాక్టర్లు సలహా ఇచ్చారు. దీంతో 14 రోజుల స్వీయ నిర్బంధం లో ఉన్న బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్  ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకొని మళ్ళీ కొవిడ్ 19 టెస్టులు చేయించుకున్నారు. ఐతే ఈసారి కూడా వారందరికీ నెగిటివ్ అని తేలింది. దీంతో వారి అభిమానులు, కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కరోనా బారిన పడిన బోనీకపూర్ ముగ్గురు పనిమనుషులు కూడా కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 


బోనీ కపూర్ ఎప్పటికప్పుడు కరోనా విషయంపై సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియపరిచారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా తనకు కరోనా సోకలేదని సోషల్ మీడియాలో వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: