కరోనా వైరస్.. ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి ఈ సమయంలో కూడా ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇంకా అలా పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు కనీసం ప్రభుత్వం పెట్టిన నిబంధనలను కూడా సక్రమంగా పాటించడం లేదు. 

 

IHG

 

ఇంకా అలా పాటించకనే ఓ యువకుడు పెళ్లి చేసుకున్న రెండు రోజులకే కరోనాతో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వరుడు గురుగ్రామ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు.

 

IHG

 

అయితే ఆ యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వ తేదీన తన స్వగ్రామమైన దీహపాలికి వచ్చాడు. ఇంకా ఆ సమయంలోనే యువకుడికి కరోనా వైరస్ సోకింది. అయితే అది అతనికి తెలియక ఈ నెల 15వ తేదీన పెళ్లిచేసుకున్నాడు. ఇంకా పెళ్లి అయినా రెండు రోజాలకే ఆరోగ్యం క్షీణించడంతో సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో మరణించాడు.                     

 

IHG

 

ఇంకా వరుడి బంధువులు కరోనా పరీక్ష చేయించకుండానే అతని మృతదేహాన్ని దహనం చేశారు. అయితే పెళ్ళికి హాజరైన కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారికీ పరీక్షా చెయ్యగా పాజిటివ్ అని తేలింది. దీంతో అందరికి పరీక్షా చెయ్యగా 95 మందికి కరోనా అని తేలింది. అయితే వధువుకు మాత్రం నెగటివ్ వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: