క‌రోనా వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగామనీ పవర్‌తో గ్లోబ్‌పై ఉన్న దేశాలను శాసించే అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఎప్పుడు? ఎలా? ఈ వైరస్ వ్యాప్తి‌ చెందుతుందో తెలియ‌క‌ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మ‌రోవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు వ్యాక్సిన్‌లు కనిపెట్టే ప్రక్రియలో ఉన్నాయి. 

IHG

అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. రాత్రి, పగలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.  అయితే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ట్రయిల్స్‌ జరుగుతున్నప్పటికి.. విజయవంతమైన వ్యాక్సిన్ బయటకు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే స‌మ‌యంలో క‌రోనా గురించి కొన్ని భ‌యంకర నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నారు. సాధార‌ణంగా కొంద‌రికి క‌రోనా సోకినా వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. అయితే కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నట్టు చైనాకు చెందిన ఓ అధ్యయనం పేర్కొంది. 

IHG

లక్షణాలు లేని దాదాపు 40 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య దారుణంగా పడిపోయిందని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత లక్షణాలు లేని వారిని పరీక్షించగా ఈ విషయం బయటపడింద‌ని అంటున్నారు. అలాగే వైరస్ లక్షణాలున్న 13 శాతం మందిలోనే యాంటీబాడీల సంఖ్య క్షీణించినట్టు తెలిపారు. వీరు చెప్పిన మ‌రో విష‌యం ఏంటంటే..  క‌రోనా బారినపడి కోలుకున్న వారికి తిరిగి వైరస్ సోకదనే భావన తప్పన్న విషయం తాజాగా జ‌రిగిన అధ్యయనంలో తేలింద‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: