ఇప్పటికే కరోనా వైరస్ తో అతలాకుతలమౌతున్న ప్రపంచ మానవాళికి సవాలు విసిరేందుకు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చినట్టుగా చైనా పరిశోధకులు బయటపెట్టారు. ఇది కరోనా కంటే డేంజర్ రకమని వారు పేర్కొంటున్నారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో కొత్త రకమైన స్వైన్ఫ్లూ ను వారు కనుగొన్నారు. ఈ మేరకు ఇప్పటికే దానికి సంబంధించి అమెరికా సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆందోళన పెరుగుతోంది . G4 అని పిలవబడే ఈ వైరస్ జన్యుపరంగా హెచ్ 1 ఎన్ 1 జాతి నుంచి వచ్చినట్లుగా చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు. 


ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదని, మానవులకు సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని, మొదటి దశలోనే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఈ వైరస్ మహమ్మారి మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంటుందని చైనా వర్సిటీ లు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2011 నుంచి 18 వరకు పరిశోధకులు చైనా  ప్రావిన్సులు, పశువైద్య ఆసుపత్రిలోని పందుల కళేబరం నుంచి 30 వేల నాజిల్ స్వాబ్స్ తీసుకుని 179 సైన్ ఫ్లూ వైరస్ లను ఇసొలట్ చేశారు.వాటిలో ఎక్కువ సంఖ్య లో కొత్తరకం వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఇవన్నీ మనుషులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


 దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. ఇప్పటికే జి ఫోర్ ప్రమాదకరమైన అంటు వ్యాధి అని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ముఖ్యంగా ఈ వైరస్ లో మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం ఉందని,  ఆసియా పక్షుల్లో కనిపించే జాతుల మాదిరిగా  ఉంటుందని, రెండవది 2009లో వచ్చిన సా ర్స్ ఎం , ఇన్ఫ్లుఎంజా మహమ్మారి కి కారణమైన హెచ్ వన్ ఎన్ వన్ జాతీ అని, మూడోది ఏవిఎన్, హ్యూమన్, పిగ్ ఇన్ఫ్లుఎంజా వైరస్ లోని జన్యువులతో ఉన్నదని, ఉత్తర అమెరికా హెచ్ వన్, ఎన్ వన్ అని పరిశోధకులు చెబుతున్నారు. 


దీనికి విరుగుడు లేదని, ఒకవేళ మనుషులకు సంక్రమిస్తే మిగతా ఫ్లూ వైరస్ మాదిరిగా తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ చైనా నుంచి మనుషులకు సంక్రమించిందని, కానీ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుందనే దానికి ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు అని అన్నారు. దీనిపై ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నామని, వివిధ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు మనుషులు అనుభవించే జ్వరం, దగ్గు, తుమ్ములు మాదిరి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. 


అందుకే చైనీస్ మార్కెట్లలో పందులతో పనిచేసే వ్యక్తులను దగ్గరగా పరిశీలించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కొత్తరకం వైరస్ గురించి బయటపడడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగిపోతుంది. ఒకవేళ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నట్టుగా తేలితే, కరోనా ను మించిన స్థాయిలో పెనుముప్పు ప్రపంచ మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: