ప్రస్తుత రోజులలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి. రక్షణ కల్పించవలసిన పోలీసులు, వైద్య సేవలు అందించవలసిన డాక్టర్లే దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. వైద్యం కోసం వచ్చిన మహిళపై లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు ఒక డాక్టర్. ఈ దారుణమైన సంఘటన ఏలూరు నగరంలో వన్ టౌన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనితో దాడికి పాల్పడిన ఫార్మా మెడికల్ వైద్యుడిని పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.

 


పూర్తి వివరాల్లోకి వెళితే... పి. సత్యా నందన్ ఏలూరు వన్ టౌన్ నవాబుపేట మారుతీ నగర్ ప్రాంతంలో ఒక క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఏలూరు నగరంలో ఆర్ఆర్ పేట లోని కంటి వైద్య శాలలో ఫార్మా మెడికల్ గైడ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను స్థానికంగా క్లినిక్ నిర్వహిస్తూ మరోవైపు వైద్య సేవలు కూడా అందిస్తాడు. ఇక ఇటీవల ఒక యువతి తలనొప్పితో బాధపడుతూ క్లినిక్ వచ్చింది. మొదట డాక్టర్లు మందులు ఇచ్చి రెండు రోజు కూడా రావాలని చెప్పడంతో మరోసారి ఆ యువతి తమ్ముని తీసుకొని వచ్చింది. ట్రీట్మెంట్ లో భాగం అని చెప్పి సత్యానంద యువతికి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. కాసేపటి వరకు ఇంజక్షన్ ప్రభావాన్ని తల తిరుగుతుందని కొద్దిసేపు కూర్చోవాలని యువతికి తెలిపాడు. 

 


అయితే ఆ సమయంలో సత్యానంద ఆ యువతిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. దీనితో బయట ఉన్న యువతి తమ్ముడు లోపలికి వెళ్లి డాక్టర్ ను అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని వెంటనే యువతి బంధువులకు తెలియజేశారు. దీనితో బంధువులు అంతా కూడా క్లీనిక్ వద్దకు వచ్చి వైద్యునికి తగిన శ్యాస్త్రి చేసారు. ఇక సంఘటన విషయాన్ని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వన్టౌన్ పోలీసులు వెంటనే క్లినిక్ వద్దకు చేరుకొని డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సంఘటనపై కేసు నమోదు చేసుకుని ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ రామకృష్ణ దర్యాప్తు మొదలుపెట్టారు. ఏది ఏమైనా కానీ వైద్యసేవలు అందించవలసిన డాక్టర్ ఇలా  నీచానికి పాల్పడడంతో బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: