ఈమధ్య కాలంలో కొందరి ఫోటోగ్రఫీ అసలు అర్థం కావడం లేదు. ఓకే వస్తువును విభిన్న కోణాల్లో ఫోటోలు తీసి ఇది ఏంటో కనుక్కోండి చూద్దాం అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ఐఏఎస్ అధికారి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకా ఏముంది ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

 

ఆ ఫొటోను చూసి ఆశ్చర్యపోతున్న కొందరు నెటిజన్లు ఈ జంతువు ఏంటబ్బా అని కామెంట్లు చేసి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్‌లో తీసిన ఈ ఫొటోను ఐఏఎస్‌ అధికారి సోనీ ఇటీవల తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇంకా ఆ ఫోటో షేర్ చేస్తూ ''ఈ ఫొటోలో ఉన్న జంతువును గుర్తుపట్టగలరా! ప్రకృతి అద్భుతమైనది, బాహుముఖ కళాఖండమని మీరు ఒప్పుకోక తప్పదు'' అంటూ ట్వీట్‌ చేశారు.

 

IHG

 

అయితే ఆ ఫొటోలో రెండు కళ్లు బయటకు కనిపిస్తుండంతో అది గూడ్లగుబ లేదా పులి లా కనిపిస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఇది పులి అయుంటుందేమోనని అభిప్రాయపడ్డారు. ఇంకా మరికొందరు అయితే అది గూడ్లగుబ కాదని క్రాప్‌ చేసిన మొసలి ఫొటో అయి ఉంటుంది అని మరో నెటిజన్ ట్వీట్‌లో వెల్లడించారు.  

 

కాగా ఈ ఫొటో రాజస్థాన్‌లోని కంబాల్‌ నది వద్ద తీసింది. అక్కడ 7 మొసళ్లు దాదాపు 1 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని, అందులో ఒక మొసలిని జూమ్‌ తీయగా ఇలా వచ్చింది ఐఏఎస్ తెలిపారు. ఇంకా ఈ ఫోటో ను చుసిన నెటిజన్లు నిజంగా ప్రకృతి అందం అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: