చైనా భారత్ సరిహద్దు వివాదం వల్ల డ్రాగన్ దేశానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా దేశాన్ని డూప్లికేట్ కంట్రీ అంటారనే సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఏ కొత్త వస్తువు వచ్చినా ఆ వస్తువుకు చైనా డూప్లికేట్ ను తయారు చేస్తోంది. అత్యంత ఖరీదైన యాపిల్ ఫోన్ కు కూడా చైనా డూప్లికేట్ తయారు చేసి తక్కువ ధరకే విక్రయిస్తుంది. ఈ విధంగానే చైనా దేశ ఆదాయాన్ని పెంచుకుంటోంది. 
 
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి బలహీనతలను చైనా ప్రధానంగా క్యాష్ చేసుకుంటోంది. విలాసవంతమైన వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం చైనా వస్తువులకు మాత్రమే డూప్లికేట్లను తయారు చేయట్లేదని... చైనా దగ్గర ఉన్నా ఆయుధాలన్నీ డూప్లికేట్ అని తెలుస్తోంది. ఇప్పుడు చైనా వాడుతున్న వస్తువుల్లో సొంతంగా ఒక్క ఆయుధం కూడా లేదని సమాచారం. 
 
ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఆర్మీలోని సైబర్ విభాగం సేకరిస్తోంది. చైనా శక్తివంతమైన ఆయుధాలని చెప్పుకునే ఆయుధాలు అన్నీ కూడా కాపీ ఆయుధాలేనని... 1980 లో చైనా ఇజ్రాయెల్ అమెరికా యుద్ధవిమానాల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని చోరీ చేసింది. రష్యన్ సుఖోయ్ ను పోలినటువంటి యుద్ధ విమానాలను తయారు చేసింది. 
 
చైనా ఇతర దేశాల యుద్ధవిమానాలను కాపీ చేసి యుద్ధవిమానాలను తయారు చేసియడంతో పాటు పలు దేశాల నుంచి చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేసి వాటికి డూప్లికేట్లను తయారు చేసింది. చైనా యుద్ధవిమానాలు, ఆయుధాలు అన్నీ ఇతర దేశాలను పోలి ఉంటాయి. అంతర్జాతీయ రక్షణా మాధ్యమాల నుంచి ఈ మేరకు చైనాకు సొంతంగా ఆలోచించే తెలివి లేదని.... ఇతర దేశాల ఆయుధాలపై ఆధారపడుతోందని తెలుస్తోంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: