తెలంగాణ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంట్రెన్సులు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. విద్యా సంవత్సరం పై తీవ్ర ప్రభావం పడనుంది. ఎంట్రెన్స్ నిర్వహించకుండా మరో మార్గం ద్వారా అడ్మిషన్స్ నిర్వహిస్తే వేలాది మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు కానున్నాయి.

 

జులై ఒకటి నుంచి జులై 15 వరకు తెలంగాణ లో జరగాల్సిన కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్ లను వాయిదా వేస్తున్నామని హైకోర్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత చెబుతామంది. ఈ నెల 4, 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన టైప్ రైటింగ్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను, సెట్స్ ని వాయిదా వేయాలని కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ కేసుని విచారించిన కోర్ట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల పై ప్రభుత్వ అభిప్రాయం  అడిగింది. లాక్ డౌన్  పెడితే ఎంట్రెన్స్ టెస్ట్ లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల పై విద్యా శాఖ అధికారులతో భేటీ అయిన సీఎస్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని కోర్ట్ కి తెలిపారు.

 

పరిక్షలు వాయిదా పడడంతో లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్ ఏంటనే సందేహం వ్యక్తం అవుతోంది. పరీక్షలు అసలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ డేట్స్ ప్రకటించాలని అంటే చాలా అంశాలని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఏ ఇతర పరీక్షలు ఉండొద్దు. జులై18 నుంచి 23 వరకు jee ఐఐటీ పరీక్షలు ఉన్నాయి. జులై 26 న నీట్ ఉంది. ఆ తరవాత ఆంధ్ర ప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ఉన్నాయి. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లకు సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ లో స్లాట్స్ లేవు... ఆగస్టు మొదటి వారం తర్వాతే నిర్ణయం ఉంటుందని అధికారులు అంటున్నారు.

 

ఇక డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు అయినట్టే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యూజీ, పీజీ పరీక్షలపై జులై 9 లోగా స్పష్టత ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి, జె ఎన్ టీ యుహెచ్ లను హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: