ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీ యావత్ జాతిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో దేశ ప్రజలు భద్రత, ఇంకా కరోనాతో ఏవిధంగా పోరాడాలి, ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించాలి అన్న విషయాల గురించి మోడీ ప్రసంగించడం జరిగింది. కచ్చితంగా సర్పంచ్ నుండి ప్రధాని వరకు ఎవరైనా ఇంటి నుండి బయటకు వస్తే మాస్కు ధరించాలని లేకపోతే జరిమానా కట్టాలని తెలిపారు. ఇదే తరుణంలో లాక్డౌన్ సమయములో దేశంలో పేదల ను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకున్న ట్లు చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉండగా కరోనా సంక్షోభం సమయములో గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ ఈ యేడాది నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశంలో ప్రజలు ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం ఉందని తెలిపారు. ముఖ్యంగా దేశంలో ఆహారపు నిలువలు మూడు సంవత్సరాలకు సరిపడా ఉన్నాయని ఇదేం దేశానికి కలిసివచ్చిన అంశమని మోడీ తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ఆహారపు నిలువలు ఉండటంతో ఇలాంటి సంక్షోభ సమయంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉండగా నవంబర్ వరకు మోడీ ఉచిత రేషన్ అంటే…  మోడీ ప్రసంగించిన తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు.  అదేమిటంటే బెంగాల్ రాష్ట్రంలో పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ ను వచ్చే ఏడాది అంటే 2021 జూన్ నెల పొడిగించినట్టు ప్రకటించారు.  అంటే ఏడాదిపాటు బెంగాల్ లో ఉచిత రేషన్ పధకం అమలు చేయనున్నట్లు మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన చాలావరకూ మమత సర్కార్ కి కలిసి వచ్చే అంశం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: