రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దశాబ్దానికి పైనే పరిటాల రవీంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే రవి చనిపోయాక కూడా పరిటాల ఫ్యామిలీ అంటే రాష్ట్ర టీడీపీ అభిమానులు ఎంతో ఇష్ట పడుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో ఆ ఫ్యామిలీకి ఫాలోయింగ్ ఎక్కువే. ఆ ఫాలోయింగ్ ఉండటం వల్లే, రవి మరణం తర్వాత ఆయన భార్య పరిటాల సునీతని వరుసగా గెలిపించుకున్నారు. ఆమె రాప్తాడు నుంచి వరుసగా రెండుసార్లు గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు.

 

అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని చంద్రబాబు రూల్ పెట్టడంతో సునీత పోటీ నుంచి తప్పుకుని, తనయుడు పరిటాల శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలబెట్టారు. కానీ అనూహ్యంగా శ్రీరామ్, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 25 వేలపైనే తేడాతో శ్రీరామ్ ఓటమి పాలవ్వడంతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి.

 

ఓడిపోయి ఏడాది దాటుతున్న కూడా రాప్తాడులో శ్రీరామ్ సెట్ కాలేదని తెలుస్తోంది. తోపుదుర్తి ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తూ…రోజురోజుకూ బలపడుతుండటంతో శ్రీరామ్‌కు పుంజుకునే అవకాశాలు దొరకడం లేదు. పైగా ఎక్కడా ఏమి మాట్లాడితే...జగన్ గతంలో జరిగిన అవినీతిని బయట పెట్టి ఇరుకున పెడతారో అని భయంతో, పరిటాల ఫ్యామిలీ పార్టీ పరంగా కూడా పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు.

 

ఇక వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీనే చూసుకుంటుంది. చాలారోజుల నుంచి ధర్మవరంలో టీడీపీని పరిటాల శ్రీరామ్ నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా దూసుకెళుతుండటంతో పరిటాల ఫ్యామిలీకి పుంజుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక భవిష్యత్ ఎన్నికల్లో సైతం రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పరిటాల ఫ్యామిలీకు గెలుపు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికైతే రెండు చోట్ల పరిటాల ఫ్యామిలీకి చెక్ పడినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: