రెండున్నర ఏళ్ళ తర్వాత పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్...అధికారంలోకి వచ్చిన మొదట్లో ఒకేసారి మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఒకేసారి 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకుని జగన్ పాలన మొదలుపెట్టి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో సీఎంగా జగన్‌కు అదిరిపోయే మార్కులు పడుతున్నాయి.

 

అలాగే కొందరు మంత్రులకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ కొందరు మంత్రుల పనితీరు పెద్దగా బాగోలేదని తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో వారి బెర్త్‌లు ఎగిరిపోవడం ఖాయమని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దాదాపు సగం మంది పదవులు పోయేలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే అందులో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులకు రీప్లేస్ తప్పదని టాక్.

 

అసలు జగన్ కేబినెట్‌లో కేవలం ముగ్గురు మహిళా మంత్రులే ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరిత హోమ్ మంత్రిగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనిత మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, విజయనగరం జిల్లా కురుపాం నుంచి గెలిచిన పాముల పుష్పశ్రీ వాణి డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ ముగ్గురుకు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఉద్వాసన తప్పదని విశ్లేషుకులు అంటున్నారు.

 

ఈ ఏడాది కాలంలో ఈ మహిళా మంత్రులు అద్భుతమైన పనితీరు ఏమి కనబర్చలేదని, ముఖ్యంగా పుష్పశ్రీ వాణి, తానేటి వనితలు మంత్రులుగా ఉన్నారన్న సంగతి రాష్ట్రంలో చాలామందికి తెలియదని అంటున్నారు. సుచరిత హోమ్ మంత్రి కాబట్టి, ఆమె కాస్త హైలైట్ అయ్యారని, కానీ పనితీరు పరంగా ముగ్గురుకి మంచి మార్కులే ఏమి పడలేదని చెబుతున్నారు. కాబట్టి నెక్స్ట్ వీరికి రీప్లేస్ తప్పదని, అయితే మహిళల్లో రోజా, విడదల రజినిలకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కవచ్చని రాష్ట్రంలో చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: