కొందరు టీడీపీ నేతలు తెలిసి మాట్లాడతారో, లేక తెలియక మాట్లాడతారో తెలియదుగానీ..ఏదో ఏదో మాట్లాడేసి జగన్‌ని ఇంకా పైకి లేపి, పార్టీకి ఇంకా డ్యామేజ్ పెంచేస్తారు. అసలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొందరు భజన నేతలు ఇష్టారీతిలో మాట్లాడి, జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలని పనికిమాలిన ప్రయత్నాలన్నీ చేశారు. అలా చంద్రబాబుని దేవుడు అన్నట్లు మాట్లాడి, జగన్‌ని వ్యక్తిగతంగా తిట్టడం వల్ల, జనాల్లో జగన్‌పై సానుభూతి పెరిగి వైసీపీకి ఫుల్ అడ్వాంటేజ్ అయింది.

 

ఆ అడ్వాంటేజ్ ఎలా ఉందో 2019 ఎన్నికల్లో తెలిసిపోయింది. ఊహించని విధంగా వైసీపీకి 151 సీట్లు ఇచ్చి, టీడీపీకి 23 సీట్లు ఇచ్చారు. సరే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక అయిన ఆ భజన నేతలు మారలేదు. అదేరీతిలో మాట్లాడుతూ జగన్‌ని లేపుతున్నారు. ఇక ఇదే విషయంపై టీడీపీ కార్యకర్తలు, తమ నేతలపైనే రివర్స్‌లో ఫైర్ అవుతున్నారు. అసలు అనవసరమైన టాపిక్స్ మాట్లాడి జగన్‌కు అడ్వాంటేజ్ అయ్యేలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

 

తాజాగా జరిగిన కొన్ని అంశాల్లో కొందరు టీడీపీ నేతలు కావాలనే దూరడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటీవల ఓ హోటల్‌లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సుజనా చౌదరీ, కామినేని శ్రీనివాస్‌లు కలిసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కొందరు టీడీపీ నేతలు పెద్ద పోటుగాళ్లలో వచ్చి వారు కలిస్తే తప్పేంటి అన్నట్లు మాట్లాడారు. అసలు దీనిపై స్పందించడమే అనవసరమని తమ్ముళ్ళు అంటున్నారు.

 

ఈ విషయంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు కాబట్టి, ఆ విమర్శలకు వివరణ ఇచ్చుకోవాల్సింది నిమ్మగడ్డ, సుజనా, కామినేనిలని. అలా కాదంటే బీజేపీ పార్టీ ఏదైనా వివరణ ఇచ్చుకోవాలని, అలా కాకుండా తగుదునమ్మా అంటూ కొందరు టీడీపీ నేతలు అనవసరంగా స్పందించి, ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్లారని, దీని వల్ల జగన్‌కే అడ్వాంటేజ్ అయిందని అంటున్నారు. అలాగే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రచ్చకు కొందరు టీడీపీ నేతలు మద్ధతు తెలిపి, అందరూ కలిసి జగన్ మీద ఏదో కుట్ర పన్నుతున్నట్లు సంకేతాలు ఇచ్చారని, దాని వల్ల జనాల్లో జగన్‌పై సానుభూతి పెరిగిందని, కాబట్టి ఇకనుంచైనా భజన నేతలు అనవసరమైన విషయాల్లో స్పందించడం ఆపేస్తే బెటర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: