నర్సాపురం ఎంపీ రామక్రిష్ణంరాజు షోకాజ్ నోటీస్ కి సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం ఎలా ఉందంటే తనను తాను సమర్ధించుకున్నట్లుగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా  గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు సైతం రాజు గారి మీద గుస్సాగా ఉన్నారు. ఆయన వైసీపీ అధినాయకత్వాన్ని ఎదిరించారని అంటున్నారు. 

 

అందువల్ల ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందేనని కోరుతున్నారుట. ఇదే విషయం మీద అభిప్రాయ సేకరణ చేసిన వైసీపీ హై కమాండ్ రాజు గారి మీద యాక్షన్ కే సిద్ధపడుతోందని అంటున్నారు. పైగా షోకాజ్ నోటీస్ లో ఆయన రాసిన విషయాల మీద కూడా హై కమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

 

ఓ వైపు జగన్ని పొగుడుతున్నట్లుగానే ఉంటూ మరో వైపు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం సొంత పార్టీ చేయాల్సిందేనా అని అడుగుతున్నారుట. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని కూడా అంటున్నారుట. ఒకవేళ అలా కనుక చేస్తే పార్టీలో అసమ్మతి హెచ్చుతుందని రాజు గారి కేసు ఒక గుణపాఠం గా పార్టీకి తెలియాలంటే చర్యలు తప్పవని అంటున్నారు.

 

ఇక రాజు గారి మీద నేరుగా వేటు వేస్తూ చర్యలు తీసుకోవడం కంటే ఆయన్ని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఏకంగా లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేయాలని కూడా ఆలోచిస్తున్నారుట. ఇదిలా ఉండగా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, ఆయన ఎంపీ పదవికి ఎసరు పెట్టేలాగానే వైసీపీ పావులు కదుపుతోంది అంటున్నారు.

 

ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ ఎంపీ బాలశౌరి లోక్ సభ స్పీకర్ ని కలసి ఇదే విషయం మీద ఆయనకు పూర్తి సమాచారం ఇచ్చారని అంటున్నారు. అంటే అక్కడ నుంచి మరే రకమైన సంకేతాలు వచ్చాయో తెలియదు కానీ రాజు గారి మీద యాక్షన్ కే వైసీపీ సిధ్ధపడుతోది, అంటే ఇపుడు బంతి లోక్ సభ స్పీకర్ చేతిలో ఉంటుంటి, మరి ఆయన నిర్ణయం తీసుకోవడం అంటే బీజేపీ హై కమాండ్ ఇష్టం కూడా ఇక్కడ చూడాలి.

 

రాజు గారు ఇప్పటికే బీజేపీకి దగ్గరైన నేపధ్యంలో అప్పనంగా ఒక ఎంపీ తమ గూటికి వస్తే తీసుకోకుండా వైసీపీ చెప్పనట్లుగా చర్యలు తీసుకుంటారా అన్న ఆలోచన కూడా వస్తోంది. మొత్తానికి ఇది బీజేపీ, వైసీపీల మధ్య ఏ రకమైన బంధాలు ఉన్నాయన్న దానికి కూడా ఒక సంకేతంగా ఉంటాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: