జగన్ వద్ద ఆయుధం ఒకటి ఉంది. ఆయన దాన్ని ఇపుడు సరైన సమయంలో ఉపయోగిస్తున్నారు. నిజానికి జగన్ ఆ ఆయుధాన్ని వాడుకోకూడదని మొదట్లో అనుకున్నారు. తన రూట్ సెపరేట్ అనుకున్నారు. కానీ వైసీపీలో ఉన్న వారు అంతా ట్రెడిషనల్ పొలిటీషియన్లే. ఎవరికైనా కావాల్సింది కుర్చీ. అది దక్కపోతే పదవుల కోసం కేకలు పెడతారు. అసంత్రుప్తి రాగాలు వినిపిస్తారు. అపుడు దాన్ని పట్టించుకోకపోతే పెరిగి పెద్దదై అసమ్మతిగా మారుతుంది.

 

నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా తన వద్ద కొన్ని పదవులు ఇలాంటి వారి కోసమే ఉంచుకుంటారు. జగన్ మాత్రం ఒకేసారి మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పైగా దానికి రెండున్నర ఏళ్ళకు అంటూ గడువు కూడా  విధించారు.  అంటే పదేళ్ళ పోరాటం తరువాత వచ్చిన వైసీపీలో మంత్రి పదవుల కోసం అసలే గోల గోలగా ఉంటే జగన్ ఆ మంత్రివర్గం విస్తరణలోనూ సామాజిక సమీకరణలు అన్నారు.  దీంతో పార్టీకి పునాది లాంటి రెడ్లు పూర్తి అసంత్రుప్తిలో ఉన్నారు. 

 

ఇక ఆ తరువాత చూసుకుంటే మిగిలిన వారు సైతం జగన్ మీద గుర్రుగా ఉన్నట్లుగా సౌండ్లు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం చూసిన మీదట జగన్ మంత్రివర్గం విస్తరణ తప్పదని అనుకున్నారు. అయితే తాను కట్టుబడిన మాటకు ముప్పురాకుండా శాసనమండలి రద్దు  ఎపిసోడ్ తెచ్చారా అన్న మాట వినిపిస్తోందిట.

 

శాసనమండలి రద్దు అంటూ ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇపుడు వారి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దాంతో పాటే అన్నట్లుగా మరికొందరు పనితీరు బాగాలేని వారిని కూడా తప్పించాలని జగన్ భావిస్తున్నారుట. ఇపుడు ఎటూ ఎవరూ ఏమీ అనలేరు. దాంతో విస్తరణ సులువుగా సాగిపోతుంది. 

 

ఇక ఈ ప్లేస్ లో పదవులు కావాల్సిన వారిని కొత్తవారిని తీసుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. అలాగే మరో 20 దాకా ఎమ్మెల్సీలు వైసీపీకి రానున్న రోజుల్లో వస్తాయట. వాటిని కూడా ఆశావహులకు కట్టబెట్టడం ద్వారా పార్టీలో అసంత్రుప్తి అసమ్మతి దాకా  దారితీయకుండా జగన్ గట్టి చర్యలు తీసుకుంటున్నారుట. మొత్తం ఈ ఎపిసోడ్ లో బంగారం లాంటి మంత్రి పదవులు కోల్పోయి రాజ్యసభకు వెళ్తున్న వారు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ కావడం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: