ప్రస్తుతం చైనా వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మొదట వ్యాప్తి చెంది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో  అల్లకల్లోలం సృష్టిస్తోంది. అదేసమయంలో చైనాలో మాత్రం పూర్తిస్థాయిలో తగ్గింది. అంతేకాకుండా ప్రస్తుతం చైనా చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన భాగాలను అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గాల్వన్ లోయపై చైనా భారత్ మధ్య వివాదం నడుస్తోంది. అదే సమయంలో జపాన్ కు సంబంధించిన కొన్ని భాగాలు కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా జపాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. 

 

 ప్రస్తుతం మరికొన్ని దేశాలకు సంబంధించిన విభాగాలు పైకూడా కన్నేసిన చైనా ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శత్రువుగా మారిపోతారు. ప్రస్తుతం అన్ని దేశాలను కవ్వించడానికి సిద్ధపడుతుంది. దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా మీద ఏకంగా చుట్టుపక్కల ఉన్న 17 దేశాలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ప్రస్తుతం అమెరికా జపాన్ భారత దేశాలు కలిపి తమఎయిర్  ఫోర్స్ విన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ చైనా మాత్రం తనకి తాను ప్రపంచ దేశాలకు ఎక్కడ తక్కువ కాదు అని చెప్పుకోవడానికి సొంతంగా విన్యాసాలు చేస్తోంది. 

 

 ఈ నేపథ్యంలో సదరు ప్రాంతానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే పేరు మర్చి జిష ఐలాండ్స్ అనే పేరు పెట్టుకున్నారు. ఇలా రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఈ   విన్యాసాలు జరగనున్నాయి . అయితే దీనిపై వియత్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దౌత్యపటమైనటువంటి నిరసన వ్యక్తం చేసిన వియాత్నం.. చైనా పేరు మార్చిన భూభాగం  అధికారం తమదేనని.. ఎట్టి పరిస్థితుల్లో తమ  భాగానికి మీరు రావడానికి వీలు లేదు అంటూ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఒకవేల  చైనా భారత్ మధ్య యుద్ధం వాతావరణ కనుక తలెత్తితే అమెరికాతో కలిసి వియత్నాం చైనా పై దాడి చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు,

మరింత సమాచారం తెలుసుకోండి: