గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసన మండలి రద్దు అనే నిర్ణయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ తలపెట్టిన 3 రాజధానుల వికేంద్రీకరణ బిల్లు.. సీఆర్డీఏ రద్దు  బిల్లును అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ శాసన మండలిలో మాత్రం తమకు మెజారిటీ తక్కువ ఉండడంతో టీడీపీ నేతలు అంగీకరించలేదు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలిని రద్దు చేసేందుకు  నిర్ణయించిన విషయం తెలిసిందే, ఇది ఆంధ్ర రాజకీయాలలో పెద్ద దుమారాన్నే రేపింది. 

 


 ఇక శాసన మండలి రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంటు కు పంపించడం.. ఎట్టి పరిస్థితుల్లో శాసన మండలి రద్దు కావాలి అంటున్న ఢిల్లీ వెళ్లి అమిత్ షా నరేంద్ర మోడీ ని  కూడా కలవడం జరిగిపోయింది. ఇక అప్పట్లో శాసన మండలి రద్దు నిర్ణయం తర్వాత ఎమ్మెల్యేలు గెలవలేని అటువంటివారు,  ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారు.. శాసన మండలి రద్దు తర్వాత అసంతృప్తి ఉన్నప్పటికీ అధినేత మీద గౌరవంతో ఎక్కడ విమర్శలు మాత్రం చేయలేదు. 

 


 అయితే గతంలో టిడిపి నుంచి ఎమ్మెల్సీ గా ఉండి ప్రస్తుతం రాజీ నామా చేసి వైసీపీ పార్టీలోకి వెళ్లిన డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆయనకి మళ్ళీ టిక్కెట్ కేటాయించారు. అంతే కాకుండా ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గం లో కూడా ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ నేపథ్యం లో జగన్ మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ కి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అప్పుడే జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయం తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు .

మరింత సమాచారం తెలుసుకోండి: