కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే.. రెండే రెండు కీలక సూత్రాలు.. ఒకటి మాస్కు కట్టుకోవడం, రెండోది భౌతిక దూరం పాటించడం.. ఈ రెండు పాటిస్తే కరోనా వ్యాప్తి చాలా వరకూ తగ్గుతుంది. అయితే తమ వరకూ వస్తే కానీ సీరియస్ గా పట్టించుకోని జనం ఉన్న దేశం మనది. అందుకే ఇంకా జనం మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు.

 

 

కానీ చాలా దేశాల్లో మాస్కు కట్టుకోకుండా బయటకు వస్తే.. భారీగా జరిమానాలు వేస్తున్నారు. ఇండియాలోనూ చాలా రాష్ట్రాలు జరిమానా నిబంధన ప్రకటించినా సరిగ్గా అమలు చేయడం లేదు. కానీ.. ఓ దేశంలో అయితే ఏకంగా ప్రధానికే ఫైన్ వేసేశారు. ఈ విషయాన్ని తాజాగా మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ లాక్‌డౌన్‌ నిబంధనల్ని మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

 

 

ఆయనే ఫైన్ కట్టిన ప్రధాని గురించి ప్రస్తావించారు. అయితే మోడీప్రధాని పేరు చెప్పలేదు. దీంతో అతనెవరన్న చర్చ మొదలైంది. నెట్‌లో గూగ్లింగ్ చేసి చూస్తే ఆ దేశం పేరు బల్గేరియా అని తేలింది. బల్గేరియా 69,48,445 మంది జనాభా ఉన్న దేశం. అంటే కోటి మంది కూడా లేరు. కరోనా మహమ్మారి వ్యాపించడంతో నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరోగ్యశాఖ కఠిన శిక్షలు అమలు చేస్తోంది.

 

 

ఈ మధ్య ఆ దేశ ప్రధాని బోయ్కో బొరిస్సోవ్‌కు అధికారులు 300 లెవ్స్ అంటే మన కరెన్సీలో రూ.13వేలు జరిమానా వేశారు. ఎందుకంటే.. బోయ్కో బొరిస్సోవ్‌ ఓ చర్చికి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్‌ ధరించలేదు. ఇది చూసిన అధికారులు ఆయనకు భారీ జరిమానా విధించారు. ఆయనతో పాటు వెంట జర్నలిస్టులకూ జరిమానా వడ్డించారు. అదీ ఫైన్ కట్టిన ప్రధాని కథ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: