నరసాపురం సర్వే - రఘురామరాజు ఎంపీ స్థానం లో ఎన్నిక జరిగితే ఫలితం ఎలా ఉంటుంది ? అని కొందరు జర్నలిస్టులు నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత వారం చేసిన ర్యాండమ్ సర్వే ఇది.

 

 

ర్యాండమ్ సర్వే అంటే ఎంపిక చేసిన ఊర్లలో తిరుగుతూ, సర్పంచులు,టీచర్లు, మహిళ గ్రూపులను అడిగి అభిప్రాయం తీసుకోవడం, కొందరిని ఫోన్లో అడగటం...ఇది ప్రజల మూడ్ ఎలా ఉందో చెబుతుంది.

 

మాట్లాడిన వారి సంఖ్య :1200

 

ఎన్నిక లు జరిగితే...

 

YCP కి ఓటు వేస్తాము అన్నవారు :780 .

TDP కి ఓటు వేస్తాము అన్నవారు : 420.

 

 

సర్వే లో వెల్లడి అయిన ప్రజాభిప్రాయలు..

 

1. వాలంటీర్ ల పట్ల సర్వత్రా ప్రశంసలు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికి వచ్చి వృద్ధుల చేతిలో పింఛన్ ఇవ్వడం పట్ల తెలుగు దేశం అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

2.మధ్య నియంత్రణ పట్ల మహిళల్లో పూర్తి సంతృప్తి వుంది.కానీ, ఎన్నడూ చూడని బ్రాండ్లు అమ్మడం పట్ల మద్యం ప్రియులు అసంతృప్తి గా ఉన్నారు.

 

3.పార్టీ కులం మతం చూడకుండా అర్హులందరికీ అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయి అని అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

 

4.కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి కానీ,మాస్క్ లు పేద వారికి అందరికీ అందడం లేదు.

 

5.పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువు చెప్పాలని ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

 

6. ఇసుక సమస్య ఇప్పటికి ఇబ్బంది గా ఉందని ఎక్కువ శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

7.కొన్ని పత్రికలు,ఛానల్స్ పక్షపాతం గా వ్యవహరిస్తున్నాయని ప్రజలు గుర్తించారు.

 

8, సోషల్ మీడియా పట్ల యూవత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

 

9, ఇంటి స్థలాలు,ఇంగ్లిష్ విద్య పేదలకు అంద కుండా ప్రతిపక్ష పార్టీ అడ్డు కుంటుంది అనే అభిప్రాయం జనం లోకి వెళ్లి పోయింది.

 

10,కోర్టులో 65 కాదు...105 మొట్టికాయలు వేసినా పేపర్ లలో రాసుకోడానికి, టీవీలలో చర్చలకే పరిమితం తప్ప, ప్రజలు పట్టించు కోవడం లేదు.

 

11, పంచాయతీ భవనాలకు పార్టీ రంగులేసినా... తెల్ల రంగులేసినా జనం పట్టించు కోవడం లేదు.

 

12, జగన్ కు వ్యతిరేకం గా కథలు నడుపుతున్న పడక్కుర్చీ విమర్శకులు, యూ ట్యూబ్ సొల్లు బాబులు, టీవీ డిబేటీషియన్లు గురించి జనం ఆలోచించే స్థితిలో లేరు.

 

సర్వే లో... 99 శాతం నిశ్శబ్ద బడుగు జీవులకు ఏం కావాలో జగన్ కు తెలుసు.జగన్ కు ఏం కావాలో వాళ్లకు తెలుసు...అనేది స్పష్టం అయింది.

- రూరల్ మీడియా

మరింత సమాచారం తెలుసుకోండి: