తెలంగాణ లో రోజు రోజుకీ కరోనా వ్యాప్తి తీవ్ర పెరిగిపోతోంది. తెలంగాణ హెల్త్ బులిటన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా  945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

 

తాజాగా కరోనా నుంచి కోలుకున్న 1,712 డిశ్చార్జ్‌ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,294గా నమోదైందిప్రస్తుతం రాష్ట్రంలో 8,795 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 869 ఉన్నాయి. ఇక తెలంగాణ లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతుంది అనే చెప్పాలి. 

 

ఇక పోతే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 704 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14595కు చేరింది. వీరిలో ఏపీకి చెందిన వాళ్లు 648 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు 51 మంది ఉన్నారు.

 

ఇదిలా ఉండగా అంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకడం గమనార్హం. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే అత్యవసర పిటిషన్‌లను ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

ఏపీ లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 18114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఏపీలో 890190 కరోనా టెస్టులు చేపట్టారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: