చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ సైకిల్ ను ముందుకు నడిపించాల్సిన బాధ్యత, బరువు అన్నీ, ఆయన తనయుడు లోకేష్ అలియాస్ చిన బాబు పై ఉంది. కాకపోతే ఇప్పటి వరకు లోకేష్ పనితీరుపై పార్టీ నాయకులలోనే అంత సానుకూల దృక్పథం లేదు. లోకేష్ చేతిలో పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని, లోకేష్ సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపించలేరు అని, సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేయడంతో, చంద్రబాబు డైలమాలో పడ్డారు. అందుకోసమే ఆయనకు ప్రత్యేకంగా రాజకీయ నిపుణులతో ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, గత కొద్ది రోజులుగా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ చురుగ్గా ఉంటున్నారు. 

 

IHG


వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కానీ, ఇటీవల అరెస్ట్ అయ్యి జైలుపాలైన టిడిపి కీలక నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమరిస్తూ వారికి ధైర్యం చెప్పడంలో కానీ లోకేష్ వ్యవహరించిన తీరు పై పార్టీ నేతల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అనంతపురం జిల్లా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు కావడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు లోకేష్ అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయన పర్యటనకు మంచి ఆదరణ లభించడంతో పాటు జిల్లా నేతల్లో కదిలిక వచ్చినట్లుగా టిడిపి అభిప్రాయపడుతోంది.

 

 అలాగే మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లా కి వెళ్ళిన లోకేష్ కు అక్కడ కూడా అంతే స్థాయిలో ఆదరణ పెరగడంతో చంద్రబాబు సరికొత్త వివాదానికి తెర తీస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా హడావుడి ముగిసిన తర్వాత లోకేష్ తో జిల్లా పర్యటనలు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. లోకేష్ పర్యటన ద్వారా పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం వస్తుందని, అలాగే లోకేష్ పై పార్టీ శ్రేణుల్లోనూ సదభిప్రాయం ఏర్పడుతుందని, అప్పుడు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: