ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొవిడ్ టెస్టింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడు రోజుల్లో రాష్ట్రంలో 76 కోడ్ మరణాలు సంభవించాయి. అంటే సగటున రోజుకు 11 మంది చొప్పున రాష్ట్రంలో చనిపోతున్నారు. కరోనా మొదలైనప్పటి నుండి ఇంత మొత్తంలో ప్రజలు చనిపోవడం జరగలేదు. అయితే విషయాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు మీడియా కానీ తగిన రీతిలో ప్రస్తావించడం లేదు. అసలు ఎందుకు గల కారణాలు ఏమి అయి ఉండొచ్చని ప్రజల సందేహాలను రేకెత్తిస్తోంది సమయంలో వైద్య నిపుణులు దీనికి ఒక థియరీ చెప్పారు.

 

ముందుగా మీడియా వారు విషయాన్ని ప్రస్తావించకపోవడానికి ప్రభుత్వం వైపు నుండి వారికి పెద్దగా తప్పులు కనిపించడం లేదు. కాబట్టి వారికి సెన్సిటివ్ మ్యాటర్ లో ఎన్నో రకమైన పరిమితులు ప్రభుత్వానికీ ఉన్నాయి. అందుకే వారికీ ధైర్యం సరిపోవడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లో చాలా వరకు ఇచ్చిన తర్వాత ఎంతోమంది పాజిటివ్ పేషెంట్లు బయటకు వస్తున్నారు అయితే వారి ఇళ్లలో ఉండే పెద్దవారు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హాస్పిటల్లో చేరడం.... రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య వల్ల వెంటిలేటర్లు అందుబాటు లోకి లేకపోవడంమరియు ఐసీయూ ఏర్పాట్లకు సమయం ఎక్కువ పట్టడంతో చాలామందికి డాక్టర్లు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు.

 

ఇక ముఖ్యంగా కరోనా ని ఎదుర్కునేందుకు రోజుకొక కొత్త మందు వస్తుంటే వాటిటో ఏపీలో క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అప్రూవల్ దొరకలేదు అని వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే క్లినికల్ ట్రయల్స్ కు కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అటు తెలంగాణలో పరిస్థితి మరింత విషమంగా ఉన్న పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేపట్టి చివరికి వాటిని గతవారమే మొదలుపెట్టేసింది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అంతేకాకుండా కోవిడ్ పేషెంట్ల పాలిట వరంగా మారినప్లాస్మా థెరఫీని కూడా ఆంధ్రప్రదేశ్లో సమర్ధవంతంగా నిర్వహించడంలేదు అని ఎన్నో అభియోగాలు ఉన్నాయి.

 

 

ఇక అతి త్వరగా చాల అధిక మొత్తంలో ప్లాస్మా థెరఫీ జరిపేందుకు ఐసీఎంఆర్ నుండి అనుమతి తెచ్చుకుని ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా విషమంగా ఉన్న పేషెంట్లు వరకు ప్రక్రియ ను నిర్వహిస్తే మంచిదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అప్పుడు డాక్టర్లు మరియు ఇతర వైద్య సిబ్బంది పై ఉన్న ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది.. మరణాల రేటు కూడా పడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: