దేశంలో కరోనా వచ్చి కష్టాలుపడుతున్నది సామాన్యుడే గానీ సంపన్నులు కాదన్న విషయం తెలిసిందే.. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఇందుకు గాను నిధులు కూడా విడుదల చేస్తున్నాయి.. అత్యవసర చర్యలు కూడా చేపట్టాయి.. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ కరోనా కాలంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుండటంతో అది పూడ్చుకోవడానికి ప్రజల పై మరింత భారం వేయడానికి సిద్దపడుతున్నాయి..

 

 

ఇప్పటికే కరెంట్ బిల్లులతో ప్రజలకు పెద్ద షాక్ తగిలింది.. ఇదే కాకుండా రెండు నెలల పాటు అందించిన 3000 వేల రూపాయలు తిరిగి మద్యం అమ్మకాల రూపంలో మళ్లీ ప్రభుత్వ ఖజానాకే చేరిన విషయం తెలిసిందే.. అంతే కాకుండా నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్న అడిగే నాధుడే లేడు.. మరోవైపు పెట్రోల్ మంటపెట్టుకు వస్తుంది.. అంటే ఒక సామాన్యుడు, దేశ, రాష్ట్ర  ఆర్ధిక పరిస్దితులతో సంబంధం లేకుండా నిత్యం ఏదో ఒక రూపంలో దోపిడీకి గురవుతున్నాడని అంటున్నారు.. ఇకపోతే మన ప్రభుత్వం మరో రూపంలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అమలుచేయడానికి సిద్దపడుతుంది.. ఈ క్రమంలో తెలంగాణలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు అందుబాటులోకి తెస్తుంది...

 

 

ఇక కొత్తగా నిర్మించబోయే రెండు టోల్‌ప్లాజాల్లో ఒకటి స్టేషన్ ఘన్‌పూర్ వద్దగల వరంగల్ జాతీయ రహదారి 163పై నిర్మాణం జరుగుతుండగా.. మరొకటి వరంగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఆరు నుంచి ఎనిమిది గేట్లతో టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ఫ్లాజాల నిర్మాణం పూర్తి అవుతుందని ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే రెండింటితో కలిపి 20కి చేరుకోనున్నాయి.

 

 

ఇకపోతే  తెలంగాణలోని టోల్‌ఫ్లాజాల ద్వారా సాధారణ రోజుల్లో నెలకు రూ.80 నుంచి 90 కోట్ల ఆదాయం సమకూరేది. లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 50 రోజులకు పైగా ఆదాయం పడిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో వాహనాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టోల్‌ప్లాజాల వద్ద ఆదాయం పెరిగింది. ఇక ఈ రెండు ప్లాజాలు ప్రారంభం అయితే ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: