కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. ఇటు రాష్ట్రాల పరిస్థితి కూడా అదే చందంగా మారింది. ప్రభుత్వాలు అప్పులు చేయాల్సిన పరి5 దాపురించింది. తెలుగు రాష్ట్రాలు కేంద్రం సాయం కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి. ఇక తెలంగాణ లో గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి అదనంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తో తెలంగాణ లో ఇప్పటికే కేసులు భారీగా పెరుగుతున్నాయి.


లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా రేషన్ , నగదు అందించింది. ఇప్పుడు ప్రభుత్వ ఖజానా తిరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అప్పులు చేయడమే దారి. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఈ ఏడాది రాష్ర్టానికి రావాల్సినంత ఆదాయం రాలేదు. మరోవైపు రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం కోత విధించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. జీఎస్డీపీలో రెండు శాతం అదనపు రుణాన్ని పొందే సదుపాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం వరకు కల్పించింది. ఇందుకు తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీ చట్టం, 2005కు అవసరమైన సవరణలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.


ఈ మేరకు ఎఫ్.ఆర్.బి చట్టం లో మార్పులు చేసి మరో రెండు శాతం అప్పులు తెచ్చుకునేలా సవరణలు జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తరఫున న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్‌రెడ్డి గెజిట్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి అదనంగా రెండు శాతం రుణం తెచ్చుకోవడానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఈ ఎఫ్.ఆర్.బి చట్టం మార్పు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరో రూ.15వేల కోట్ల వరకు అదనపు రుణం తెచ్చుకొనే అవకాశం కలుగుతుంది.


 ఈ ఆర్థిక సంవత్సరంలో లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ, వలస కార్మికులకు రైళ్లు వంటి ఉపశమన చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది.  గతేడాది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 1,435 కోట్ల రూపాయలను అదనంగా అప్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు కరోనా వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరిగే పరిస్థితి కనబడడం లేదు ఈ సమయంలో అప్పులు తెచ్చి రాష్ట్ర ఆదాయాన్ని చూపించాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక చట్టాల్లో సవరణలు చేయలాని ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ప్రయత్నం సఫలం అయితే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు మరో 15 వేళా కోట్ల రూపాయలు రుణం అందుంతుంది. కరోనా లాంటి విపత్కర సమయాల్లో అది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: