దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కొంత మేరకు అయినా అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. దింతో దేశంలో చాల వరకు ఆర్థిక నష్టం వాటిల్లింది. తాజాగా దేశంలో లాక్ డౌన్ లో సడలింపులు చేశారు. దింతో రవాణా వ్యవస్థ, షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. కరోనా కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల నుండి గ్యాస్ వరకు అన్ని వస్తువుల ధరలు పెంచుతున్నాయి.

 

 

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాకిచ్చారు. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పైపైకి చేరాయి. అయితే ధర పెరుగుదల స్వల్పంగానే ఉందని చెప్పుకోవచ్చు.ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.4.50 వరకు పెరిగింది. జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం.

 

 


ప్రభుత్వ రంగం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 14.2 కేజీల సిలిండర్‌కు ఇది వర్తిస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర రెండో నెల కూడా పెరగడం గమనార్హం. ఇకపోతే ఎల్‌పీజీ సిలిండర్ ధర జూన్ నెలలో రూ.11.5 మేర పెరిగిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మార్చి నుంచి మే వరకు చూస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.277 మేర తగ్గింది.

 

 

ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ.1 మాత్రమే పెరిగింది. దీంతో ధర రూ.594కు చేరింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.4.5 పెరిగింది. దీంతో ధర రూ.620కు ఎగసింది. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పైకి చేరింది. దీంతో ధర రూ.594కు ఎగసింది. చెన్నైలోనూ గ్యాస్ సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.610కు చేరింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.645కు ఎగసిందని యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: