దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. దింతో ప్రజలు చాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాల మంది తినడానికి తిండి లేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. దేశ ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. అంతే కాకుకండా లాక్ డౌన్ సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు కీలక కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

 

 

అయితే ఏటీఎం చార్జీలు మిహాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏ బ్యాంక్ ఏటీఎంలో అయినా డబ్బుల విత్‌డ్రా చేసుకోవచ్చని తెలియజేశారు. జూన్ 30 వరకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో జూలై 1 నుంచి మళ్లీ బ్యాంక్ కస్టమర్లు ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి దాటితే ఏటీఎం చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

 

 

ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్య కాలంలో బ్యాంక్ కస్టమర్లు వారి ఖాతాల్లో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదన్నారు. ఎలాంటి చార్జీలు పడవని తెలిపారు. అయితే జూలై 1 నుంచి మాత్రం మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయి. లేదంటే చార్జీలు భారించాల్సి ఉంటుందన్నారు. బ్యాంక్ ప్రాతిపదికన ఈ పెనాల్టీలు మారతాయన్నారు.

 

 

అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరిన వారు నెలవారీ చందా మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో కలిగి ఉండాలన్నారు. బ్యాంకులు ఏపీవై స్కీమ్ ఆటో డెబిట్‌ను జూలై 1 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపాయి. కరోనా వైరస్ కారణంగా జూన్ 30 వరకు ఆటో డెబిట్ ఆప్షన్‌ను నిలిపివేస్తున్నట్లు బ్యాంకులకు ఆదేశాలు అందాయన్నారు.

 

 

అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటిం.చారు. జూలై 1 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలులోకి వస్తుంది. వడ్డీ రేట్లు 0.5 శాతం మేర తగ్గాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి 3 నుంచి 3.5 శాతం వరకు వడ్డీ వస్తుందని యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: