డబ్బంటే ఎవరికి ఛేదు.. డబ్బుకు లోకం దాసోహం అంటుంటారు.  నిజమే ఈ మద్య డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం.. పలుకుబడి.  అయితే ఈ డబ్బు ఉన్నవారి సంగతి పక్కనబెడితే.. మద్యతరగతి కుటుంబాలకు చెందినవారు కష్టపడి సంపాదిస్తే జీవితం కాలం మొత్తం అతని కుటుంబ పోషణ కోసం.. పిల్లల చదువులు, ఆరోగ్యం ఇలా ఎన్నో సమస్యలతోనే సరిపోతుంది.  ఒకవేళ ఏదైనా జాక్ పాట్ తగలడమో.. లాటరీ, గుప్తనిధులు దొరికితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతాను.  కానీ ఈ మద్య ఉన్న చోటు ఉండి కొంత మంది సైబర్ నేరగాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు.  దానికి వారు అమాయకును టార్గెట్ చేయడమే కాదు.. ఉన్నత చదువులు చదువుకొని విజ్ఞానవంతులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు.

 

హలో మీ పేరు ఇదే... మీకు పలానా కంపెనీ నుంచి గిఫ్ట్ నామినేట్ చేశారని.. అందుకోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ డీటేల్స్ అడుగుతారు. చెప్పినంక కొద్దిసేపటికి అకౌంట్లోని పైసలన్నీఖాళీ చేస్తున్నారు.  ఇలాంటి ఆన్లైన్ మోసాలు కామారెడ్డి జిల్లాలో ఇటీవల పెరుగుతున్నాయి. మూడు నెలల్లో ఆరుకు పైగా ఘటనలు జరిగాయి. మరికొన్ని బయటకు రానివి కూడా ఉన్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నా నేరస్తులు మాత్రం దొరకడంలేదు. ఇటీవల మాస్క్ లు పంపుతామని రూ.30 లక్షలు కాజేసిన విషయం తెలిసిందే. ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఏటీఎం కార్డు, పిన్ నంబర్లు అడుగుతున్నారు.

 

ఎందుకని ప్రశ్నిస్తే తప్పులు సరిదిద్దాలని చెబుతున్నారు. మీ అకౌంట్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పడాలంటే..  జీఎస్టీ, ఐటీ కట్టాలంటూ అకౌంట్లో పైసలు వేయించుకోవటం, తక్కువగా రేటుకు వస్తువులు అమ్ముతున్నామంటూ.. ఇలా పలు రకాలుగా ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ చేసిన వ్యక్తులను నమ్మి బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్, ఏటీఎం పిన్నంబర్లు చెప్పగానే ఖాతాల్లో నుంచి నగదు మాయం చేస్తున్నారు. తీరా తాము మోసపోయామని తెలిసిన తర్వాత లబో దిబో అంటు సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: