ఈ మద్య కొంత మంది బురిడీ బాబాలు గల్లీ గల్లీకి పుట్టుకొస్తున్నారు. అయితే కొంతమంది బాబాాలు మాత్రం బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో గోల్డెన్ బాబా ఒకరు. సుధీర్‌ మక్కర్‌ అంటే అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ‘గోల్డెన్‌ బాబా’  పేరు చెబితే ఠక్కున గుర్తుకొస్తాడు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న  గోల్డెన్ బాబా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ, క‌న్నుమూశారు. గోల్డెన్ బాబా హరిద్వార్‌కు చెందిన ప‌లువురు అఖాడాల‌తో సంబంధం కలిగి ఉన్నారు. గోల్డెన్ బాబా ప‌లు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు.  నిత్యం ఒంటిపై 15 నుంచి  20 కేజీల బంగారం నగలు ధరించే బాబాకు నేర చరిత్ర చాలా ఉంది. ఆయన స్వస్థలం ఘజియాబాద్ కాగా, దశబ్దాల నుంచి ఢిల్లీలో తిష్టవేశారు. బాబా మొదట్లో బట్టల వ్యాపారం చేసేవారు. ఆయన 1972 నుంచి బంగారం ఎక్కువగా ధరించడం మొదలెట్టాడు. బంగారమే తన దేవత అని బాహాటంగనే చెప్పుకునేవాడు.

IHG' from <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> who wears 16 kg <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GOLD' target='_blank' title='gold-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>gold</a> - OrissaPOST

బంగారం వల్ల తనకు ప్రాణహాని ఉందని 25 మంది గార్డులను నిత్యం తన చుట్టూ ఉంచుకునేవాడు.  బంగారమే కాకుండా ఖరీదైన కార్లు, రోలెక్స్ వాచీలు కూడా ఆయన చాలా ఇష్టం. కుంభమేళాలో తరచూ ఓపెన్ టాప్ జీపుల్లో కనిపించేవాడు. బాబా స్వ‌స్థ‌లం ఘజియాబాద్‌. సన్యాసి కావడానికి ముందు ఆయ‌న ఢిల్లీలో వస్త్ర వ్యాపారం చేసేవారు. స‌న్యాసం తీసుకున్న త‌రువాత గాంధీనగర్‌లో గోల్డెన్ బాబా ఆశ్రమం ఏర్పాటు చేశారు. అనారోగ్యం కారణంగా ఆ తర్వాత నుంచి భారీ  బంగారు ఆభరణాలను ధరించడం తగ్గిస్తూ వచ్చారు.

IHG'IHG', this Kanwar season's star attraction - YouTube

తన వద్ద 21 గోల్డ్‌ లాకెట్లు, బంగారు ఆభరణాలు,  ఖరీదైన చేతి గడియారాలు ఉన్నాయి.  ఆయన వద్ద బంగారు ఆభరణాలు మాత్రమే కాదు లగ్జరీ కార్లు బీఎండబ్ల్యూ, ఆడీలు, ఇన్నోవాలు, విలాసవంతమైన భవనాలు ఇలా చాలా ఉన్నాయి.   బాబా మృతిచెందడంతో ఆయన భక్తులందరూ విషాదంలో మునిగిపోయారు.  ఇక బాబాపై కిడ్నాప్, దోపిడీ, దాడి, హ‌త్యాబెదిరింపు త‌దిత‌ర నేరాల‌కు సంబంధించిన కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: