వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం  రోజు జరుగుతూనే ఉంది. అయితే ఆయనను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అనేది చెప్పడం  మాత్రం కాస్త కష్టంగానే ఉంది. ఆయన పార్టీలో ఇప్పుడు సంకలో పుండు మాదిరిగా మారిపోయారు అని అంటున్నారు. ఆయన వ్యవహారశైలి ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అధికార పార్టీలో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ పరిణామం జ‌గ‌న్‌కు‌, పార్టీ వ‌ర్గాల‌కు చికాకుగానే ఉంది అని చెప్పాలి. 

 

ఇక ఆయన విషయంలో సిఎం జగన్ ఆలోచించి అడుగు వేయడానికి ప్రధాన కారణం వేరే ఉంది అని అంటున్నారు. ఆయన వర్గం నేతలు కొందరు బలమైన వారు ఉన్నారట. క్ష‌త్రియ క‌మ్యూనిటీని జ‌గ‌న్ పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇక ర‌ఘు రామ‌కృష్ణంరాజుకు పశ్చిమ గోదావరి తో పాటుగా  తూర్పు గోదావరి లో కూడా బలమైన వర్గం ఉంది. ఈ బలమైన వర్గం ఆయన వైపుకి తిరగకుండా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని తెలుస్తుంది. వారు పార్టీ మారే ఆలోచన లేకుండా ముందే కట్టడి చేయడానికి గానూ కీలక మంత్రులు రంగంలోకి దిగారు అని అంటున్నారు.

 

క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన మంత్రి రంగ‌రాజుతో పాటు ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు, కోన‌సీమ‌లో ఉన్న రాజులు అంద‌ర రంగంలోకి దిగార‌ని తెలుస్తోంది. పార్టీ మారినా సరే ఆయన ఒంటరి అయ్యే అవకాశం ఉంది అని అందుకే మీరు ఆయనతో ఉన్నా సరే మీకు అంతగా  ఫలించే అవకాశం లేదు అని చెప్తున్నారట. ఇదే రఘుకి కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉందని బిజెపిలోకి వెళ్తే ఒంటరి గా వద్దు అని ఆయన భావిస్తున్నారట. కాని వైసీపీ అధిష్టానం మాత్రం తాను చేసేది తాను చేయ‌డంతో పాటు ర‌ఘును పూర్తిగా ఒంట‌రిని చేసేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: