కరోనా నియంత్రణ కోసం రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనా కిట్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద్ యొక్క స్వసరి కరోనిల్ కిట్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని, ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని యోగా గురు రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు. అయితే ఈ మందు కేవలం ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు అని కరోనా మందు కాదని అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు రాందేవ్ బాబా ఆయుర్వేద సంస్థ పతంజలి తయారు చేసిన కరోనా ఔషదంపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, ఓ సారి కరోనా మందుగా మార్కెట్లోకి వదిలిన తర్వాత ఆయూష్ మంత్రిత్వ శాఖ దాన్ని అడ్డుకుంది.  ఆ తర్వాత అది అసలు కరోనాకు మందు కాదంటూ ఇటీవల స్టేమెంట్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా నడిచాయి. రకరకాల ఊహాగానాల మధ్యలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

 

‘కరోనిల్’‌కు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.  తాజాగా కరోనిల్ కిట్ మందుల కోసం లైసెన్స్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుష్ శాఖ ఇచ్చిందని పేర్కొన్నారు . ఆయుష్ మంత్రిత్వ శాఖతో మాకు విభేదాలు లేవు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు, కరోనిల్, స్వాధారి, గిలోయ్, తులసి, అశ్వగంధపై ఎటువంటి ఆంక్షలు లేవని రాందేవ్ బాబా పేర్కొన్నారు ఈ రోజు నుండి, ఈ మందులు (స్వాసరి కరోనిల్ కిట్) దేశంలో ఎటువంటి చట్టపరమైన పరిమితులు లేకుండా లభిస్తాయని స్పష్టం చేశారు.

 

పతంజలి పరిశోధనలకు సంబంధించిన వివరాలను ఆయూష్ మంత్రిత్వ శాఖకు అందజేశారు. వారం రోజుల్లో రోగులకు 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఈ రీసెర్చి పత్రాలను పరిశీలించిన తర్వాత ఆమోదం లభించిందని రాందేవ్ బాబా వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: