దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఒక్కరోజే కొత్త‌గా 2,084 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ఢిల్లీలో ఇప్పటివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేల మార్కును దాటింది.   ఇక విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కూడా కేసులు బాగా పెరిగిపోయాయని అన్నారు. మార్చి నెల నుంచి ఢిల్లీలో లాక్ డౌన్ కఠినంగా పాటించారు. కానీ ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు బాగా పెరిగాయి.   దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,680కి చేరింది. 

 

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కంట్రోల్‌లో ఉందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. జూన్‌ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు.  రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు.  ప్రతి ఒక్కరి కఠోర శ్రమ వల్లే సమర్ధవంతంగా పరిస్థితిని అదుపు చేయగలిగాం అని కేజ్రీవాల్ తెలిపారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆశలు వదలుకోవడం కానీ, చేతులెత్తేయడం కానీ తాము చేయలేదని, ఎక్కడి నుంచి సహాయం కావాల్సి ఉన్నా అడిగి మరీ తీసుకున్నామని చెప్పారు. 

 

ఇప్పుడు 100 మందికి చేస్తే 13 మందికి పాజిటివ్‌ వస్తోంది  అని కేజ్రీవాల్‌ అన్నారు.  డెత్‌రేట్‌ 3 శాతంగా ఉంది అని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలో రోజుకు 16 వేల నుంచి 21వేల టెస్టులు చేస్తున్నారు. తాజాగా  కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం 87,360 కోవిడ్-19 కేసులు ఉండగా, వీటిలో 26,270 యాక్టివ్ కేసులున్నాయి. 58,348 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరి డిశ్చార్చి అయ్యారు. 2,742 మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనా మహమ్మారి బారిన పడి సోమ‌వారం కొత్తగా 57 మంది ప్రాణాలు కోల్పోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: