దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్‌పై అధికారులకు కీలక సూచనలు చేశారు ప్రధాని. పెద్ద ఎత్తున టీకాల పంపిణీకి నాలుగు సూత్రాల ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

 

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి భారత్‌ సహా పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వివిధ దేశాల్లో జరుగుతున్న పరిశోధనల్లో మనం భాగస్వామ్యం కూడా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే దానిని ఎలా పంపిణీ చేయాలనే దానిపై ఫోకస్‌ పెట్టింది భారత్‌ సర్కార్‌.  

 

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. వ్యాక్సిన్‌ అందుబాటును పరిగణనలోకి తీసుకొని సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాలుగు సూత్రాల అధారంగా వ్యాక్సిన్‌ పంపిణీపై నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పున్న ప్రజలకు ముందుగా టీకాను ఇవ్వాలని సూచించారు ప్రధాని. అంటే, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు తదితరులకు ముందుగా వ్యాక్సిన్ అందుతుంది. తర్వాత మిగతావారికి  వ్యాక్సిన్‌ అందేలా చూడాలనేది ప్రధాని రెండో సూచన. దేశ నలుమూలల్లోని అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలన్నారు ప్రధాని. కరోనా వ్యాక్సినేషన్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదన్నారు మోడీ. ఇక వ్యాక్సీని సరసమైన ధరలో అందుబాటులో ఉండేలా చూడాలన్నది ప్రధాని చేసిన మూడో సూచన. ఇక వ్యాక్సిన్​ఉత్పత్తి దగ్గర నుంచి పంపిణీ వరకు సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ ఉండాలన్నది ప్రధాని నాల్గో సూచన. దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ.  

 

కరోనా వ్యాక్సిన్‌పై వివిధ దేశాల్లో జరుగుతున్న పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ర్టాజెనెకా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మనకు అందుబాటులోకి రాగానే ప్రజలకు టీకాలు వేయించే దిశగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: