తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కేసులు ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 945 పాజిటివ్ కేసులు వచ్చాయి. వాటిలో 869 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చెల్ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. ఇవాళ్టి కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి పెరిగింది. తాజాగా ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజగా మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

దీంతో కేసుల సంఖ్య 70కి చేరింది. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన (76) సంవత్సరాల వృద్ధుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖానాపురం వద్ద గల ప్రశాంతినగర్ కు చెందిన (50) సంవత్సరాల వ్యక్తి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. సింగరేణి మండలం పోలంపల్లికి చెందిన (27) సంవత్సరాల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 

ఈమె హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో పరీక్ష చేయించుకుని వైద్యం పొందుతున్నది.  అలాగే  ఓ చికెన్ షాపు యజమానికి పాజిటివ్ గా తేలడంతో హైదరాబాద్ లోని చెస్ట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు మళ్లీ మొదలవుతున్నాయని ఇక్కడ అధికారులు అంటున్నారు. కరోనా కేసులు తేలిన చోట శానిటైజర్ చేస్తున్నామని.. ప్రజలకు అవగాహన ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: