దేశంలోని ప్రధాన వార్తాసంస్థలలో ఒకటైన పీటీఐకి ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. రాయిటర్స్, ఏ.ఎన్.ఐ, పీ.టీ.ఐ, యూ.ఎన్.ఐ లాంటి న్యూస్ ఏజెన్సీలు తమ సిబ్బంది ద్వారా వార్తలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేస్తారు. గతంలో పీటీఐ, యూ.ఎన్.ఐ వార్తలపైనే ప్రముఖ పేపర్లు సైతం ఆధారపడేవంటే వాటి క్రెడిబులిటీ సులభంగా అర్థమవుతుంది. దేశ, విదేశాలకు సంబంధించిన వార్తల కోసం ఇప్పటికీ వీటిపైనే మనం ఎక్కువగా ఆధారపడుతుంది. 
 
సుదీర్ఘకాలం నుంచి ఉన్న పీటీఐకు అగ్ర నేతలతో కూడా నేరుగా మాట్లాడేంత ప్రాముఖ్యత ఉంది. పీటీఐ సంస్థ క్లుప్తంగా సమాచారం అందిస్తుంది. ఈ సమాచారంపై ఇతర మీడియా సంస్థలు దృష్టి పెట్టి ఆ సమాచారాన్ని వివిధ కోణాల్లో వ్యక్తం చేస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా పత్రికలు, టీవీ ఛానెళ్లు పీటీఐ సంస్థ అందిస్తున్న సమాచారంపై ఆధారపడటం తగ్గించాయి. తాజాగా ప్రభుత్వ విభాగాలు కూడా పీటీఐ వద్దని నోట్ పంపించాయి. 
 
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పీటీఐ భారీ సంక్షోభంలో పడే పరిస్థితి నెలకొంది. ఇలా పీటీఐపై కేంద్రం ఈ విధంగా వ్యవహరించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం పీటీఐ చైనాలో ఉన్న భారత రాయబారిని ఇంటర్వ్యూ చేసింది. చైనా వాస్తవాధీన రేఖ దాటి మన దేశంలోకి రాలేదని చెప్పిన సందర్భంలో చైనా రాయబారి సరిహద్దుల నుంచి చైనా వెనక్కు వస్తే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
రాయబారి చేసిన వ్యాఖ్యలను పీటీఐ భారత భూభాగంలోని చైనా సైనికులు చొరబడ్డారని ప్రచారం చేసింది. దేశానికి విరుద్ధంగా పీటీఐ వ్యవహరిస్తుందనే ఆరోపణలతో వీరిపై చైనా నిషేధం విధించింది. అయితే ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పీటీఐ సమాచారం వద్దని నోటీసులు జారీ కావడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో పీటీఐ విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: