దేశంలో కరోనా కేసులు అంతకంతగా పెరిగిపోతూనే ఉన్నాయి.  భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,653 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 507 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,85,493కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17,400కి పెరిగింది. 2,20,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,47,979 మంది కోలుకున్నారు. మార్చిలో కరోనా కేసులు బాగా పెరిగిపోవడం మొదలు కాగానే.. లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు.  

IHG

ఇప్పటికే ఎంతో మంది డాక్టర్లు, పోలీసులు కరోనాతో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇప్పుడు మనం అండగా ఉండాల్సిన సమయం వచ్చింది.  కరోనా సమయంలో విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ సమయంలో ఎప్పుడూ ఆ టీవీ లేదంటే ఫోన్.. ఈ రెండేనా.. ఆన్ లైన్ క్లాసులో చెప్పింది కాసేపైనా రిఫర్ చేసుకోవచ్చుగా.. ప్రతి ఇంట్లో రోజూ ఉండే సీన్ ఇది.  ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన ఓ పదవతరగతి విద్యార్థి జారెబ్ వర్దన్ ఆలోచనలు మాత్రం ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి నుంచి విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమని తాము ఎలా రక్షించుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టాడు. వారి కోసం ఫేస్ షీల్డులు తయారు చేయడానికి సమయాన్ని వెచ్చించాడు.

IHG

 3డీ ప్రింటర్ ను ఉపయోగించి ఈ రక్షణ మాస్కులను తయారు చేస్తున్నాడు. నాన్న ఇచ్చిన పాకెట్ మనీతో 3డీ ప్రింటర్ కొనుగోలు చేసి తను చదువుకునే రూమ్ నే ఫేస్ షీల్డ్ తయారు చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీవాత్సవకు 100 ఫేస్ షీల్డులు తయారు చేసి ఉచితంగా అందించాడు. షీల్డ్ లతో పాటు వైరస్ నుంచి రక్షణ ఇచ్చే N-95మాస్కులను తయారు చేసే పనిలో ఉన్నానని తెలిపాడు. పోలీసులతో పాటు వైద్య సిబ్బందికీ ఈ మాస్కులను అందజేస్తానని జారెబ్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: