గత రెండు నెలలుగా భారత్ చైనా దేశాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోందన్న సంగతి తెలిసిందే. చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న భారత్ ఆ దేశానికి వరుస షాకులిస్తోంది. రెండు రోజుల క్రితం భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్ టాక్, హలో, కామ్ స్కానర్ లాంటి ప్రముఖ యాప్స్ పై కేంద్రం బ్యాన్ విధించింది. దీంతో చైనా వేల కోట్ల రూపాయలు నష్టపోనుంది. 
 
ఈ యాప్స్ నిబంధనలను ఉల్లంఘించాయనే కారణంతో భారత్ నిషేధం విధించింది. భారత్ యాప్స్ పై నిషేధం విధించడం గురించి మన దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భారత్ జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా సేవలను వినియోగించుకోమని స్పష్టం చేసింది. నితిన్ గడ్కరీ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు చైనాతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. 
 
గల్వాన్ ఘటన అనంతరం చైనాపై భారత ప్రజల్లో కూడా విపరీతమైన ద్వేషం వ్యక్తమైంది. ప్రజలు కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారత్ ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఏ వస్తువు ఏ దేశంలో ఉత్పత్తి అయిందో పేర్కొనాలని కూడా సూచనలు చేసింది. అమెరికా, చైనా ఇప్పటికే చైనా ఉత్పత్తులు వాడబోమని ప్రకటనలు చేశాయి. ప్రస్తుతం నార్త్ అమెరికాలో సైతం ఈ తరహా యాక్టివిటీ ఇటీవల ప్రారంభమైంది. 
 
నార్త్ అమెరికాలో కూడా చైనాకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయవద్దని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ ప్రజలు ఇప్పటికే చైనా వస్తువులను కొనడం మానేశారు. నార్త్ అమెరికాలో చైనాపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. మరికొన్ని దేశాలు కూడా చైనా విషయంలో ఇదే విధంగా వ్యవహరించే అవకాశాలు ఉండటంతో భవిష్యత్తులో చైనా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: