జగన్..మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఆయన ఎవరి దగ్గరా పనిచేయలేదు. ఆయన పార్టీ పెట్టడానికి ముందు రాజకీయ అనుభవం మూడు నెలల ఎంపీ అయితే ముఖ్యమంత్రి కావడానికి పదేళ్ళ కఠోర శ్రమ. ప్రజలతో సన్నిహితంగా మెలగడం. అందుకే జనం నాడి పట్టుకున్న ప్రజా వైద్యుడిగా జగన్ నిలిచారు.

 

లేకపోతే కరోనా టైంలో ఏకంగా 1088 అంబులెన్సులు రాష్ట్రంలో ప్రారంభించడం అంటే మాటలు కాదు, 200 కోట్ల రూపాయల‌ పై చిలుకు ఖర్చు చేసి మరీ వీటిని ప్రతీ మండలానికి ఒకటి వంతున తీసుకువస్తున్నారు. ఇవి కూడా అత్యాధునికమైనవవి. ఇందులో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏ సదుపాయాలు ఉన్నాయో అన్నీ ఉంటున్నాయి. ఇక ఈ అంబులెన్సులోనే రోగికి సగానికి పైగా వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.

 

ఇక పట్టణాలలో పది నిముషాలు, గ్రామాలలో ఇరవై నిముషాలు, ఏజెన్సీలో పాతిక నిముషాలు ఈ అంబులెన్స్  సమాచారం అందిన వెంటనే చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సులను జగన్ జెండా ఊపి ప్రారంభిస్తూంటే ఆ సీన్ చూడడానికే అద్భుతం అనిపించింది. వరసగా క్యూలో ఇన్ని వందల అంబులెన్సులు ఒకే మారు ఓపేన్ కావడం భారతీయ వైద్య రంగంలోనే అరుదైన ఘటనగా చెప్పుకోవాలి.

 

అంతే కాదు ప్రతీ 74 వేల మందికి ఒక అంబులెన్సు ఉండడం అంటే భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా  ప్రజలకు చాలా సమీపంగా ప్రభుత్వ వైద్యాన్ని అందించిన ఘనత మాత్రం జగన్ సర్కార్ దే అనిపిస్తుంది. ఇక అంబులెన్సులలో పనిచేసె టెక్నెషియన్ల జీతాలు ఒక్కసారిగా యాభై శాతం జగన్ పెంచేడం అంటే అది మానవత్వంగా చూడాలి

 

కరోనా వేళ మామొలుగానే ఉద్యోగులకు ఎక్కడా జీతాలు అందని పరిస్థితి. అలాంటిది వీళ్లకు జీతలు పెంచి తక్షణం అమలు చేస్తామని జగన్ చెప్పడం అంటే ప్రజా వైద్యానికి పెద్ద పీట వేసినట్లే. ఇక ప్రతీ ఇంటికీ డాక్టర్ తప్పనిసరిగా విజిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, పీ హెచ్ సీ లని 24 గంటలూ పనిచేసేలా చూడడం, అలాగే కొత్తగా ఆరు వేల మంది డాక్టర్లను నియమించడం ఇవన్నీ కూడా చూస్తూంటే వైద్యానికి జగన్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి అవుతోంది. నిజంగా ఇది దేశానికే ఆదర్శం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: