చిన్న కాలువ తెగితే పెద్ద ప్రమాదంగా చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాలేశ్వరం అని , కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన సంగతిని మరచిపోయి తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, హరీష్ రావు మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్ బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కాలువక 200 సార్లు గండి పడిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఇటీవల మనోహరాబాద్ లో కురిసిన వర్షానికి రైల్వే లైన్ తెగి కొట్టుకుపోయింది అని , దీనికి కారణం ప్రధాన మంత్రి అని మేము అంటే బిజెపి నాయకులు ఒప్పుకుంటారా అంటూ హరీష్ రావు నిలదీశారు.

IHG


 కాంగ్రెస్ హయాంలో నీరు, కరెంటు ఇవ్వకుండా, రైతులను గోస పెట్టారని , అసాధ్యమనుకున్న గోదావరి నీటిని తెచ్చి రైతులకు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అంటూ హరీష్ రావు ప్రశంసించారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే గ్లోబల్స్ పార్టీ అని ముద్ర పడిందని , అందుకే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కొండపోచమ్మ సాగర్ కు వచ్చిన కాంగ్రెస్, బిజెపి నాయకులు ఆ నీటిని నెత్తిమీద చల్లుకుని, చేసిన తప్పును ఒప్పుకుని, కొండపోచమ్మ కు దండం పెట్టుకోవాలని హరీష్ బోధ చేశారు. 


ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి ఏవైనా సలహాలు ఉంటే ఇవ్వాలని, కానీ బురద చల్లి వెళ్లిపోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పైపులు పటాకుల్లా పెలిపోయాయని, అప్పుడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఏం చేశారంటూ హరీష్ రావు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: