అమెరికాలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. కరోనా మరోసారి విలయం సృష్టిస్తోంది...రోజుకు కనీసం లక్ష కేసులు నమోదయ్యే ప్రమాదముందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెండు మూడునెలల్లో కరోనా మరణాలు రెండు లక్షలు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అమెరికన్లు కనీసజాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా ట్రంప్ నోరు మెదపడటం లేదు.

 

అమెరికాలో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితులు వస్తాయా ? త్వరలోనే ఆ రోజు వస్తుందని హెచ్చరిస్తున్నారు అమెరికా వైద్య నిపుణలు. ప్రముఖ వైరాలజిస్ట్... వైట్‌ హౌస్ టాస్క్‌ఫోర్ట్ సలహాదారుడు... ఆంటోని ఫౌసీ లెక్కల ప్రకారం అమెరికాలో కరోనా విలయం రానున్న రోజుల్లో ఎక్కవగా ఉండబోతోంది.పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో రోజుకి లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని  
ఆయన హెచ్చరించారు.

 

కరోనా విజృంభిస్తున్నా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ డిస్టెన్సంగ్ పాటించకపోవడం, కనీసం మాస్క్‌లు కూడా ధరించకపోవడంపై ఫౌసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు హెచ్చరించినా... బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడుతూనే ఉన్నారన్నారు.

 

అమెరికాలో కరోనా కేసులు 27 లక్షలు దాటి పోయాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 40 వేల కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే... అతి త్వరలోనే మొత్తం కేసులు 30 లక్షలు దాటిపోయే ప్రమాదముంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

 

అక్టోబర్ నాటికి అమెరికాలో కరోనా మరణాలు రెండు లక్షలు దాటతాయన్నది ఓ అంచనా...పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... అధ్యక్షుడు ట్రంప్ తన ధోరణిని మార్చుకోవడం లేదు.. కరోనాను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నామని చెబుతున్నారు... అధ్యక్షుడే మాస్క్ పెట్టుకోనప్పుడు ఇక దేశ ప్రజలు ఎలా ఫాలో అవుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: