ఇప్పటికే అన్ని విషయాల్లోనూ అందరితో నూ  ప్రశంసలు అందుకుంటూ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఏపీ సీఎం జగన్ మరో క్రెడిట్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం కష్టకాలంలో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, జగన్ ప్రజల సంక్షేమం, వారి ఆరోగ్యం వంటి విషయాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా జగన్ ఇదే తీరుతో ముందుకు వెళ్తున్నారు..ఇప్పటికే జగన్ పరిపాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన పనితీరుకు దేశవ్యాప్తంగా, పార్టీలకు అతీతంగా ప్రశంసలు అందుతున్నాయి.

 

తాజాగా ఈరోజు 108 104 వాహనాలు 1088 ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం జాతీయ స్థాయిలో జగన్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం విధానాలను ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సూచించగా, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది జగన్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో, ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు అభినందనీయం అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ (జగన్) ట్విట్ చేసారు. ఈ విషయంతో జగన్ పై మరింత గౌరవం పెరిగింది అని, ఈ స్థాయిలో 108 ,104 వాహనాలను ప్రవేశపెట్టిన జగన్ మోహన్ రెడ్డికి అభినందన లు అంటూ పూరి ట్వీట్ చేశారు.

 

ఇక సంగీత దర్శకుడు తమన్ కూడా అదే విధంగా జగన్ కు అభినందనలు తెలియజేశారు.. వీరే కాకుండా అనేక మంది ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.  వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు ఉన్న అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చిన ఏపీ సీఎం జగన్ ను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: