చైనా దేశానికి ఇతర దేశాలతో పోలిస్తే ఒక ప్రత్యేకత ఉంది. ఆ దేశం గొప్పల విషయంలో ప్రపంచానికి తెలిసేలా వ్యవహరిస్తూ చెడ్డపేరు తెచ్చే వాటి విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటోంది. చైనా దేశంలోని వుహాన్ లో గతేడాది డిసెంబర్ నెలలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ విజృంభణ వల్ల ఆ దేశం పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కేవలం రెండే రెండు నెలల్లో వైరస్ ను కంట్రోల్ చేయడంలో చైనా సక్సెస్ అయింది. 
 
చైనా వైరస్ గురించి ప్రపంచానికి ఎటువంటి విషయాలు చెప్పకపోయినా వైరస్ ను జయించామని మాత్రం గొప్పలు చెప్పుకుంది. అయితే వైరస్ ను చైనా ఏ విధంగా నియంత్రించిందనే విషయాలు ప్రపంచ దేశాలకు తెలియవు. అయితే తాజాగా చైనా రాజధాని బీజింగ్ లో వైరస్ విజృంభించడంతో అక్కడ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణం కావడంతో ప్రపంచ దేశాలు ఆ దేశం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాయి. 
 
చైనాలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. చైనాలో పెద్దఎత్తున ఉత్పత్తులు ప్రారంభమయ్యాయని డ్రాగన్ చెబుతున్నా అంత సీన్ లేదని అక్కడి లెక్కలు చెబుతున్నాయి. చైనా దేశం ఎగుమతులు ఊహించిన దాని కన్నా చాలా తక్కువగా ఉన్నాయని కరోనా వైద్య చికిత్సకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే ప్రస్తుతం ఆ దేశాన్ని కాపాడుతున్నాయి. 
 
గడిచిన నాలుగేళ్లలో చైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని సమాచారం. అక్కడ పరిశ్రమలకు 50శాతం డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తున్నట్టు తెలుస్తోంది. తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అనేలా చైనా చెబుతున్న మాటలను ఎవరూ పట్టించుకునే అవకాశం లేదు. చైనా చేస్తున్న ప్రకటనలలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: