2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించింది అంటే, ఆ విషయంలో ప్రశాంత్ కిషోర్ అనబడే ఒక రాజకీయ మేధావి వెనకుండబట్టే అనేది అందరికీ తెలిసిందే. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకే పరిమితం చేయడంలో జగన్ కు వెన్నుదన్నుగా నిలబడి, సమర్థవంతంగా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయించే  పనిని ప్రశాంత్ కిషోర్ టీమ్ తీసుకోవడమే కాదు, చాలా సమర్థవంతంగా ఆ బాధ్యతలను నిర్వహించారు. ఇది ఇలా ఉంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి అప్పుడు ఏడాది దాటిపోయింది. జగన్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ, ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా తన బలం నిరూపించుకున్నాడు. ఏడాది ఈ కాలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 3.50 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు కలిగే విధంగా జగన్ సాయాన్ని అందించారు.

 

ఇంత వరకు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో జనాల అభిప్రాయం ఏంటనేది స్పష్టంగా జగన్ కు తెలియడం లేదు. పార్టీ నాయకుల ద్వారా వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే బ్రహ్మాండంగా ఉందనే జగన్ కు రిపోర్టులు అందుతున్నాయి. కానీ పార్టీ నాయకులు, అధినాయకుడు దగ్గర మెప్పు పొందేందుకు ఆ విధంగా చెబుతారని, వాస్తవాలు చెప్పేందుకు వారు వెనుకడుగు వేస్తారు అనే ఉద్దేశంలో ఉన్న జగన్ ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇసుక, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కొంత మంది ఎమ్మెల్యేలపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సంగతులను తనకు తెలియజేయాలని ప్రశాంత్ కిషోర్ ను జగన్ రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.

 

ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. అలాగే  వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన పీకే టీం సర్వే నిర్వహించబోతోందట. ముఖ్యంగా నాయకులకు వాలంటీర్లకు మధ్య చాలా చోట్ల వివాదాలు ఏర్పడుతూ ఉండటం వంటి అంశాలపైన పీకే  టీమ్  ద్రుష్టి సారించాల్సిదిగా జగన్ కోరినట్లు తెలుస్తోంది. మరి పీకే టీమ్ ఏ సంచలన విషయాలను రిపోర్టర్ రూపంలో జగన్  కు అందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: