జగన్..రాజకీయాలు దూకుడుగా ఉంటాయి. ఆయన పాలన కూడా దూకుడుగానే ఉంటుంది. నాన్చొద్దూ అంటారు జగన్. ఆయన ఆలోచనలు ఆచరణలకు పక్కాగా  నోచుకోవాల్సిందే. లేకపోతే ఆయన తన కమిట్మెంట్ తీర్చలేదని బాధపడతారు. అందుకే ఎన్నికైన తొలి ఏడాదిలో తొంబై శాతం హామీలను నెరవేర్చారు. ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారు.

 

ఇక జగన్ పాలనలో కొత్త మెరుగులు దిద్దుతున్నారు. ఆయన తండ్రి వైఎస్సార్ బేసికల్ గా డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ పధకానికి శ్రీకారం చుట్టారు. జగన్ తండ్రి ఆశయ సాధనకు రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఆయన ఆరోగ్యశ్రీకి మరింతగా అభివ్రుధ్ధిచేస్తున్నారు. అదే విధంగా విద్య వైద్యానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. 104, 108 అంబులెన్సులను ఏపీలో 1088ని కొత్తగా తీసుకురావడం ద్వారా జగన్ దేశంలోనే వైద్య విప్లవానికి నాంది పలికారు.

 

ప్రాధమిక వైద్యానికే ఈ దేశంలో కరవు అవుతున్న పరిస్థితి. సామాన్యుడు ఎవరైనా జ్వరం వచ్చినా కూడా వందలు ఖర్చు చేయాల్సిన దారుణ వాతావరణం ఉంది. ఇక దేశంలో చూసినా ఏ రాష్ట్రంలో కూడా ప్రజా వైద్యం గురించి బడ్జెట్ లో తక్కువలో తక్కువ  పదిశాతం కూడా కేటాయించలేని పరిస్థితి ఉంది.  అటువంటి చోట జగన్ యూరోపియన్ దేశాల మాదిరిగా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయడం పట్ల జాతీయ స్థాయిలో హర్షం వ్యక్తం అవుతోంది.

 

ఇక విద్య విషయంలో కూడా అతి చిన్న దేశంగా ఉన్న‌ ఫిన్ లాండ్ ని అంతా చెప్పుకుంటారు. అక్కడ విద్యకు బడ్జెట్ లో బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ ప్రభుత్వం సర్కార్ బడులను నాడు నేడు పేరిట అభివ్రుధ్ధి చేయాలని చూడడం గొప్ప విషయంగా చెప్పాలి. ప్రైవేట్ స్కూల్స్ తో దీటుగా సర్కార్  బడులను తీర్చిదిద్దడం మెచ్చుకోవాల్సిందే.

 

ఇప్పటిదాకా దేశమంతా మరచిన రంగాలు ఈ రెండూ, పారిశ్రామిక ప్రగతి అంటారు, మరో రంగం అంటారు, కానీ అతి కీలకమైన విద్య, వైద్యం సగటు  ప్రజలకు అందుబాటులోకి తెస్తే అది నిజంగా మహోదయమే. సరికొత్త విప్లవమే. జగన్ అందుకే ఈ రెండింటి మీద టార్గెట్ చేశారు. ఈ విషయంలో జగన్ సక్సెస్ అయితే మాత్రం ఆయన చరిత్రలో ఎప్పటికీ  నిలిచిపోతారు. ఉత్తమ పాలకుడిగా కూడా సర్వత్రా  కొనియాడబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: